AP Assembly Sessions: ఎల్లుండి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ

ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో  మరికొన్ని వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. కాగా ఈ సమావేశాలకు జగన్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది.

AP Assembly: ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం
New Update

AP Assembly Sessions: ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ 18న అధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పలు విభాగాలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో  మరికొన్ని వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. మరోవైపు ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

11 మందితో జగన్..

మాజీ సీఎం జగన్‌ హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన వస్తారని మాజీ మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. జగన్‌తో సహా 11 మంది ఎమ్మెల్యేలు వస్తారని.. ప్రభుత్వాన్ని నిలదీస్తారని పేర్కొన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వమిదని.. అసెంబ్లీలో మా వ్యూహాలు మాకున్నాయని అన్నారు.

ఇదిలాఉండగా.. వైసీపీ (YCP) కి 11 సీట్లు మాత్రమే రావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. దీంతో జగన్ సాధారణ ఎమ్మెల్యేగానే రానున్నారు. అయితే చర్చల్లో పాల్గొనేందుకు జగన్‌కు తగినంత సమయం లభిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే అసెంబ్లీలో ఆయన వ్యూహాం ఏంటి.. ఎలాంటి అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారే దానిపై ఆసక్తి నెలకొంది.

Also Read : తాడిపత్రిలో హైటెన్షన్… 50 రోజుల తరువాత ప్రత్యేక్షమైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి




#ap-assembly
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe