AP : ఏపీలో ఫైనల్ ఫలితాలు..ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే!

మే 13న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఏపీ ఎన్నికల కౌంటింగ్‌ పై ఫైనల్‌గా ఫలితం వచ్చేసింది. ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలిచాయో పూర్తి లెక్క వచ్చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

AP : ఏపీలో ఫైనల్ ఫలితాలు..ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే!
New Update

AP Assembly Elections Final Results : మే 13న ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు (General Elections Results) మంగళవారం విడుదల అయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఏపీ ఎన్నికల కౌంటింగ్‌ (Election Counting) పై ఫైనల్‌గా ఫలితం వచ్చేసింది. ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలిచాయో పూర్తి లెక్క వచ్చేసింది. 175 అసెంబ్లీ సీట్లకు గాను ఎన్డీఏ కూటమి (NDA Alliance) 164 సీట్లతో అఖండ విజయాన్ని నమోదు చేసింది.

వైసీపీ (YCP) కేవలం 11 స్థానాలతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఎన్డీఏ కూటమిలోని పార్టీలను చూసుకుంటే.. టీడీపీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన 21కి 21 స్థానాలు సొంతం చేసుకుని 100% విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక బీజేపీ మొత్తం 10 చోట్ల పోటీ చేయగా.. 8 సీట్లలో విజయం సాధించింది.

ముందు వైసీపీ 10 స్థానాలకే పరిమితం అవుతుందని అనుకున్నారు కానీ.. చివర్లో ఆ పార్టీ మరో స్థానాన్ని తన అకౌంట్లో వేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శి స్థానం రిజల్ట్‌ పై చివరి వరకూ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ముందు రౌండ్‌లలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆధిక్యంలో ఉన్నారు.

కానీ.. చివరి రౌండ్‌లకు వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ ఆధిక్యంలో వచ్చారు. చివరికి ఆయన 2,597 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో.. వైసీపీ సంఖ్య 11కి చేరింది. ఏపీ చరిత్రలో ఇంత ఘోర ఓటమి నమోదు కావడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. గత ఎన్నికల్లో టీడీపీ కనీసం 23 సీట్లు అయినా వచ్చాయి. కానీ వైసీపీ కి మాత్రం 11 నే వచ్చాయి.

Also read: ఏపీలో వైసీపీ గెలిచిన 11 స్థానాలు ఇవే!

#ycp #tdp #ap-cm-ys-jagan #ap-assembly-elections-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe