Narsipatnam YCP Leaders: ప్రజల్లో వ్యతిరేక పవనాలు కనిపిస్తుండటంతో వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు. ఇంతవరకు ఇచ్చిన పథకాలను గుర్తు చేస్తూ, లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నారు. వారి మాట వినని వారిపై బౌతిక దాడులకు దిగుతున్నారు. ఇప్పటికే వాలంటీర్లు ఎన్నికల ప్రచారం తదితర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నా, వాటిని తుంగలో తొక్కి వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, పోలీసులు, ఎన్నికల అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
AP Politics: రెచ్చిపోయిన నర్సీపట్నం వైసీపీ నేతలు.. ఇంటిపై జెండా కట్టొద్దన్నందుకు..
అనకాపల్లి నర్సీపట్నంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఇంటిపై జెండా కట్టవద్దన్నందుకు కుటుంబంపై దాడికి దిగారు. దాడిలో వాలంటీర్ తో పాటు నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాడిలో బాధితులు పళ్లు ఊడిపోయి, గాయాల పాలైన బాధితులు ఏరియా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
New Update
నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం, చీడిగుమ్మలలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఘటనలో వాలంటీర్, రేషన్ వెహికల్ నిర్వహిస్తున్న ఆమె భర్త కలిసి సోదరుడు అని చూడకుండా ఒక కుటుంబంపై కలియబడ్డారు. చీడిగుమ్మలలో నివాసం ఉంటున్న ఉలంపర్తి అప్పారావు కూలీ పనులు చేసుకుంటుండగా, ఆమె భార్య ఉలంపర్తి నాగలక్ష్మి ఏటిగైరంపేటలో ఏఎన్ఎమ్ గా విధులు నిర్వహిస్తోంది. రేషన్ పంపిణీ వాహనంలో తమ్ముడు రాజు, మరదలు శాంతకుమరి వాలంటీర్ గా పనిచేస్తున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య గతంలో విభేదాలున్నాయి. దీనిపై జరిగిన తగాదాలో పోలీసు కేసు నడుస్తోంది.
ఇలాంటి పరిస్థితి ఉన్నా సోమవారం రాత్రి అప్పారావు ఇంటికి వచ్చి, వచ్చే ఎన్నికలకు మీరు వైసీపీ జెండా కట్టాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. దీనిపై అప్పారావు ఇప్పటికే మన మధ్య గొడవలున్నాయి. నేను ఏదో ఒకటి చేసుకుంటాను.. మా విషయం వదిలేయ్ అన్నాడు. దీంతో తమ్ముడు రాజు, అన్నయ్య అప్పారావుపై కలియబడ్డారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన వాలంటీర్ శాంతకుమారితో పాటు రాజు తల్లిదండ్రులు వచ్చి అప్పారావుపై కలియబడ్డారు. మీకు ఉద్యోగం ఇచ్చింది వైసీపీ (YCP) ప్రభుత్వమని, అందుకే మీరు ఓటేయాలని నాగలక్ష్మిని హెచ్చరించింది. ఈ ఘటనను ఎవరూ అడ్డుకోకపోవడంతో అప్పారావు పళ్లు ఊడిపోయే విధంగా పిడిగుద్దులు గుద్దారు. దీంతో అప్పారావుకు పళ్లు ఊడి, తలకు గాయం అయ్యింది. ఈయనకు చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఎస్ఐ కృష్ణారావు మాట్లాడుతూ బాధితుల పిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisment