MSMP Twitter review: 'లవ్‌ యూ స్వీటి'.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ట్విట్టర్ రివ్యూ ఇదే!

అనుష్క శెట్టి-నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'పై ట్విట్టర్‌లో తెగ రివ్యూలు ఇచ్చిపడేస్తున్నారు ఫ్యాన్స్‌. చాలా కాలం తర్వాతం సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన అనుష్క మరింత క్యూట్‌గా కనపడిందని కామెంట్లు పెడుతున్నారు. సినిమా అదిరిందంటున్నారు. మరికొందరు మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో లేదని పోస్టులు పెడుతున్నారు. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, నాజర్, తులసి, అభినవ్ గోమతం, సోనియా దీప్తి, మరియు కేశవ్ దీపక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

New Update
MSMP Twitter review:  'లవ్‌ యూ స్వీటి'.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ట్విట్టర్ రివ్యూ ఇదే!

Miss Shetty Mr Polishetty Twitter review: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'(Miss Shetty Mr Polishetty) అనుష్క శెట్టి-నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా ఇవాళ(సెప్టెంబర్ 7) జన్మాష్టమి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. UV క్రియేషన్స్, మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుష్క(Anushka), నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరోహీరోయిన్లగా నటించడంతో భారీ అంచనాల మధ్య విడుదలైంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించింది. ఆమె చివరిసారిగా మాధవన్‌తో కలిసి నిశ్శబ్దం అనే చిత్రంలో కనిపించింది. ఈ చిత్రం 2020లో తెరపైకి వచ్చింది. దీంతో అనుష్క అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్‌గా వెయిట్ చేశాయి. ట్రైలర్‌ని చూసిన తర్వాత సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని వెయిట్ చేయగా.. ఆ రోజు రానే వచ్చింది. ట్విట్టర్‌ రివ్యూ ప్రకారం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా ఎలా ఉంది.? అమెరికాలో ఇప్పటికే చాలా మంది సినిమా చూసేశారు.. మరి వాళ్లు ఏం అంటున్నారు?

షెఫ్‌ పాత్రలో అనుష్క:
అనుష్క లండన్‌లో ఉన్న అన్విత రవళి శెట్టి అనే షెఫ్ పాత్రను పోషించింది. ఆమె ఫెమినిస్ట్, పెళ్లి చేసుకోకుండా ఉంటుంది. అయితే ఆమె తల్లి కావాలని, తన బిడ్డను కనాలని తపన పడుతోంది. స్టాండప్ కమెడియన్ సిద్ధు పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి)ని కలుసుకుంటుంది. అన్విత- సిద్ధూ కలుసుకోవడం, సన్నిహితంగా మారడం ద్వారా అన్విత సిద్ధూని దాతగా ఉండమని కోరింది. తర్వాత ఏమి జరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.

ట్విట్టర్ రివ్యూ:
ట్విట్టర్‌ రివ్యూ ప్రకారం ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా అనుష్క ఫ్యాన్స్‌ తెగ ఆనందపడుతున్నారు. హీరోలకే అభిమానులుండే చిత్రపరిశ్రమలో హీరోయిన్‌ అయిన అనుష్కకు మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉండగా.. అభిమానులు ముద్దుగా స్వీటి అని పిలుచుకునే ఈ స్టార్ ఈ సినిమాతో సినీ లవర్స్‌ని కట్టిపడేసిందట. అటు నవీన్‌ పోలిశెట్టి తన మార్క్‌ టైమింగ్‌ డైలాగులతో ప్రేక్షలకులను ఫిదా చేశాడని పోస్టులు పెడుతున్నారు. అయితే రివ్యూలు ఇచ్చే కొన్ని పేజీలు మాత్రం సినిమా బాగోలేదని.. అనుష్క కామ్‌బ్యాక్‌ మంచిగా లేదని చెబుతున్నారు. మరికొందరు ఈ రివ్యూలు ఇచ్చేవారికి క్రెడిబిలిటీ లేదంటున్నారు. ఖుషీ మావీకి మంచి రేటింగ్ ఇచ్చి.. ఈ సినిమా బాగున్నా కూడా కావాలని తక్కువ రేటింగ్ ఇస్తున్నారని మండిపడుతున్నారు.


తారాగణం, క్రూ
ఈ చిత్రంలో అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, నాజర్, తులసి, అభినవ్ గోమతం, సోనియా దీప్తి, మరియు కేశవ్ దీపక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం: మహేష్ బాబు పాచిగొల్ల. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. నీరవ్ షా కెమెరా క్రాంక్ చేయగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేశారు. రాధన్ ఈ చిత్రానికి పాటలు సమకూర్చగా, నేపథ్య సంగీతాన్ని గోపీ సుందర్ అందించారు.

ALSO READ: అనుష్క చికెన్ కర్రీ.. ప్రభాస్ పలావ్.. అభిమానులకు పసందే..

ALSO READ: సలార్ కాదు.. రూల్స్ రంజన్.. రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Advertisment
Advertisment
తాజా కథనాలు