/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-23T192753.985.jpg)
RCB Vs RR Match : ఐపీఎల్ 2024 సీజన్ లో ఎలాగైనా ట్రోఫీని దక్కించుకోవాలని చివరి దాకా పోరాడిన RCB.. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో పరాజయం పొందిన సంగతి తెలిసిందే. గత 16 సీజన్స్ నుంచి ఊరిస్తూ వస్తున్న RCB.. ఈసారి కప్ కొడుతుందనే ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది. దాంతో ఎప్పటిలాగే RCB ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
RCB ఓటమి.. అనుష్క శర్మ కంటతడి
కాగా బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ ని విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ స్టేడియంలో వీక్షించింది. రాజస్థాన్ పై కచ్చితంగా RCB గెలుస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్న అనుష్క శర్మ మ్యాచ్ ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది.
అంతేకాదు RCB ఓటమితో అనుష్క శర్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అందుకు సంబందించిన కొన్ని విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన RCB ఫ్యాన్స్ అనుష్కను ఓదారుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Anushka Sharma clicked in the stands 💗 pic.twitter.com/y4ZAQ6XjEa
— Ankita ✨ (@VirushkaStann) May 22, 2024
Follow Us