Anurag Singh Thakur: తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్శలు గుప్పించారు. రాహుల్, ఓవైసి (Asaduddin Owaisi) ది ఔరంగజేబు స్కూల్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సనాతన ధర్మాన్ని ఖతం చేయాలని చూస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు టైం ఇచ్చి చూడండి అంటాడని.. అసదుద్దీన్ ఒవైసీ గోవులను కొస్తూ... తింటూ ఉండండని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
ALSO READ: ఎమ్మెల్సీ కవితకు బెయిల్? .. టెన్షన్లో బీఆర్ఎస్ శ్రేణులు
అక్బర్ , అసద్ వ్యాఖ్యల మీద రాహుల్, సోనియా ఎందుకు మాట్లాడారు? అని నిలదీశారు. బీజేపీ కి ముందు పదేళ్లు కాంగ్రెస్ (Congress) పాలించింది.. కాంగ్రెస్ హయాంలో మహిళ బిల్లు ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. అప్పుడు రాహుల్ , ఒవైసీ ఎక్కడ ఉన్నారు? అని అన్నారు. రాహుల్ ను మా మహిళ నేత ఓడించిందని గుర్తు చేశారు. ఇక్కడ ఓవైసీ ఓటమి సైతం.. మహిళ చేతిలో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
కవిత నిర్దోషి అయితే బెయిల్ ఎందుకు రాలేదు? అని అన్నారు. కవిత ఇక్కడ దోచుకుంది చాలక ఢిల్లీ వెళ్లి దోచుకోవాలని చూసిందని ఆరోపించారు. లిక్కర్ కేసులో ఢిల్లీ సిఎం తో సహా అంత జైల్ లో ఊచలు లెక్క పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అంబేద్కర్ కి భారత రత్న కూడా ఇవ్వలేదు, సర్దార్ పటేల్ కు ఏం చేశారు? అని నిలదీశారు. సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని నడిపించిందని అన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ 40 సీట్లలో గెలవడానికే తిప్పలు పడుతుందని వ్యాఖ్యానించారు.