బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘మ్యాగ్జిమమ్ సిటీ’ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా నిలిచిపోవడం తనని ఎంతగానో బాధకు గురి చేసిందంటున్నారు. సుకేతు మెహతా రచించిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ స్పెషల్ ప్రాజెక్ట్‌గా పట్టాలెక్కిన ఈ మూవీ అనుకోని కారణాలతో నిలిచిపోయింది. అయితే ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు అనురాగ్.
Also read :దానివల్లే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది.. అనన్యాపాండే
‘నేను చాలా సినిమాలు తీయడానికే ఇండస్ట్రీలోకి వచ్చాను. కానీ నాకు ఎంతో ఇష్టమైన ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడి వర్క్ చేశాను. నిజంగా చెప్పాలంటే ఇదే నా బెస్ట్ వర్క్. అయితే సరైన కారణాలు చెప్పకుండా ఓటీటీ సంస్థ ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలగింది. ఆ విషయాన్ని నేను తట్టుకోలేకపోయా. అది నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. మానసిక కుంగుబాటుకు గురై అతిగా మద్యం సేవించా. ఆ సమయంలో రెండు సార్లు గుండెపోటుకు గురయ్యా. ఏదైమైనా నేను దాన్ని కోల్పోయాను’ అంటూ గతన్ని తలచకుంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే స్టార్ హీరోలతో సినిమాలు చేయడంపై కూడా మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో స్టార్ల వెంటపడడం తప్పలేదు. స్టార్లు లేకుండా నువ్వు ఈ ప్రాజెక్టు చేస్తున్నావ్.. ఒకవేళ ఇదే మూవీలో స్టార్లు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకో అని చాలామంది నాకు సలహా ఇచ్చేవారు. స్టార్లుగా పేరొందిన వారికి అశేష అభిమానులుంటారు. ఆ అభిమానులను దృష్టిలో పెట్టుకోవడం వల్ల స్టార్లతో ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కించడం కష్టం. అందుకే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారితో సినిమాలు చేయాలనుకోను. విదేశీ దర్శకులు హీరోల అభిమానుల కోసం సినిమాలు తీయరు. అక్కడ స్వేచ్ఛ ఉంటుందని తన అభిప్రాయం వెల్లడించారు. ఇక ఇటీవల ఇక ‘బ్లాక్ ఫ్రైడే’, ‘నో స్మోకింగ్’, ‘బాంబే వెల్వెట్’, ‘దోబారా’ వంటి చిత్రాలకు అనురాగ్ దర్శకత్వం వహించగా సన్నీలియోనీ, రాహుల్ భట్‌తో ఇటీవల ‘కెన్నెడీ’ నిర్మించారు. జీ 5 వేదికగా విడుదలైన ఈ చిత్రం ఊహించినంత విజయం సాధించలేకపోయింది.