Anupama Parameswaran : అయ్యో అనుపమా.. అన్నీ అలాంటివేనా?

టిల్లూ స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో అందులో హీరోయిన్ గా చేసిన అనుపమ పరమేశ్వరన్ క్రేజ్  మారిపోయింది. గ్లామర్ రోల్ లో..అదరగొట్టేసింది. అనుపమకు ఇప్పుడు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే, అన్నీ గ్లామర్ రోల్స్ వస్తున్నాయని చెబుతున్నారు. మరి అనుపమ ఏం  చేస్తుందనేది ప్రశ్న!

Anupama Parameswaran : అయ్యో అనుపమా.. అన్నీ అలాంటివేనా?
New Update

Anupama : అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran).. మన పక్కింటి అమ్మాయిలా కనిపించే సినిమా హీరోయిన్. క్యూట్ గా ఉంటూ.. అంతకంటే సున్నితంగా నటిస్తూ అందరినీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ. అఆ, శతమానం భవతి వంటి చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులకు చాలా దగ్గరైన నటి. అనుపమకు తెలుగులో ఇప్పటివరకూ ఫ్యామిలీ ఫ్యాన్స్ చాలా ఎక్కువగానే ఉన్నారు. చాలా మంచి సినిమాల్లో చేసినా.. పెద్ద బ్రేక్ మాత్రం టాలీవుడ్ లో తనకు రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అనుపమ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. కుటుంబ కథా సినిమాలను పక్కన పెట్టి.. బోల్డ్ సీన్లకు ఒకే చెప్పి.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. సిద్ధూ జొన్నలగడ్డ తన టిల్లూ స్క్వేర్ సినిమాలో అనుపమ(Anupama Parameswaran) హీరోయిన్ అని ఎనౌన్స్ చేయగానే టాలీవుడ్ ఉలిక్కిపడిందనే చెప్పాలి. ఎందుకంటే, టిల్లూ  సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉంటుందో అందరికీ తెలిసిందే. కచ్చితంగా హీరోయిన్ బోల్డ్ సీన్స్.. లిప్ లాక్స్ ఉంటాయి. అనుపమ అటువంటి సీన్స్ కి ఒకే చెప్పింది అనగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఆమె అభిమానులు అయితే, అలాంటి సీన్స్ లో చేయవద్దు అంటూ నెట్టింట్లో పెద్ద హంగామానే చేశారు. కట్ చేస్తే.. 

అనుపమ(Anupama Parameswaran) మాత్రం టిల్లూ స్క్వేర్ వదులుకోలేదు. అందులో ముద్దు సన్నివేశాలనూ తప్పించుకోలేదు. నిజానికి టిల్లూ స్క్వేర్(Tillu Square) లో మొదటి పార్ట్ లో కన్నా ఎక్కువ ఘాటు సన్నివేశాలు హీరోహీరోయిన్ల మధ్య ఉన్నాయి. వాటిలో సునాయాసంగా నటించేయడమే కాకుండా.. సినిమా విడుదలయ్యాకా.. పెద్ద హిట్ టాక్ తో దూసుకుపోతుంటే.. లిప్ లాక్స్ లో నటిస్తే తప్పేంటి అంటూ అనుపమ ప్రశ్నించింది. దీంతో ఇప్పుడు ఒక్కసారిగా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) కి సంబంధించి చాలా వార్తలు గుప్పుమంటున్నాయి. 

Also Read:ఈ 555 రూల్ పాటిస్తే.. రిటైర్మెంట్ లైఫ్ కోట్లతో ఎంజాయ్ చేయొచ్చు! 

టిల్లూ స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో అనుపమ రేంజ్ అమాంతం పెరిగిపోయిందని చెబుతున్నారు. చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం అనుపమను హీరోయిన్ గా తీసుకోవాలని నిర్మాతలు క్యూ కడుతున్నారట. అయితే, మన సినిమాల్లో ఒక మూస పధ్ధతి ఉంది కదా. ఒకరకమైన పాత్ర హిట్ కొడితే.. ఇక తరువాత అన్నీ అలాంటి వేషాలే నటులకు ఇస్తుంటారు. ఇప్పుడు అనుపమకు కూడా ఇలానే టిల్లూ లాంటి బోల్డ్ క్యారెక్టర్స్.. గ్లామర్ సీన్స్.. ఉన్న సినిమాలే ఎక్కువగా ఆఫర్ చేస్తున్నారని అంటున్నారు. ఇది సహజమే. కానీ, టిల్లూ విజయంతో అనుపమ(Anupama Parameswaran) తన పాత ఫ్యామిలీ హీరోయిన్(Family Heroine) విధానాన్ని పూర్తిగా మార్చుకుంటుందా అనేదే తేలాల్సి ఉంది. 

ఏది ఏమైనా.. ఒక్క సూపర్ హిట్.. దశను మార్చేసింది. కానీ.. అనుపమ సినీ కెరీర్ జర్నీని కూడా గ్లామర్ బాటలోకి తోసేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే, అనుపమ ఇలా ఆ గ్లామర్ వైపు పరుగులు తీస్తోందా? సినిమాలను జాగ్రత్తగా ఎంచుకుని.. ముందడుగు వేస్తుందా అనేది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా టిల్లూ స్క్వేర్ విజయం సిద్ధూ కంటే.. అనుపమకు మంచి క్రేజ్ తెచ్చిందని చెప్పాలి. 

#tollywood #anupama-parameswaran #family-heroine
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe