Vandhe Bharat: తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్‌..ఎక్కడి నుంచి అంటే!

మరి కొన్ని వందే భారత్ రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు సందర్భాల్లో విడతల వారీగా ప్రధాన నగరాలను కలిపే విధంగా వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

Vandhe Bharat: తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్‌..ఎక్కడి నుంచి అంటే!
New Update

తెలుగు రాష్ట్రాలకు (Telugu states) మరో వందే భారత్‌ (Vande bharat) అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నాలుగు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ లను నడుపుతుండగా..ఇప్పుడు మరో వందే భారత్‌ కోసం కేంద్రం పచ్చ జెండా (Green Signal) ఊపింది. ప్రస్తుతం నడుస్తున్న నాలుగు వందే భారత్ ల్లో కూడా ప్రయాణీకుల రద్దీ విపరీతంగా ఉంది.

ప్రజలు కూడా ఎక్కువ శాతం మంది వందేభారత్ లో ప్రయాణించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో మరి కొన్ని వందే భారత్ రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు సందర్భాల్లో విడతల వారీగా ప్రధాన నగరాలను కలిపే విధంగా వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

Also read: పోలీసు అధికారిని చెప్పుతో కొట్టిన మహిళ..అసలేం జరిగిందంటే

మరోసారి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అతి త్వరలోనే మరో వందే భారత్‌ రైలును రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడిపేందుకు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే సిద్దమయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌- విశాఖ పట్నం మధ్య అతి త్వరలో మరో వందే భారత్‌ ను తిప్పేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఈ రూట్‌ లో ఒక రైలు ప్రవేశ పెట్టగా..ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో రెండో వందే భారత్‌ రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ప్రస్తుతం వెళ్తున్న వందే భారత్‌ ట్రైన్‌ వరంగల్‌ మీదుగా నడుస్తుంది. అయితే ఈ సారి నడిపే రైలును గుంటూరు మీదుగా విశాఖకు నడపనున్నారు.

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ - విశాఖ మధ్య వందే భారత్‌ రైలును ప్రవేశ పెట్టగా..ఆక్యుపెన్సీ రేషియో అత్యధికంగా ఉంటుంది. దీంతో ఆ మార్గంలో మరో వందే భారత్‌ ను తీసుకుని రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ దీపావళికి ఈ వందే భారత్‌ ను తీసుకుని రానున్నట్లు సమాచారం.

#two-telugu-states #vandhe-bharat
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe