తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందా? రానున్న రోజుల్లో మళ్లీ వర్షాలు కురువనున్నాయా? ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురువయనున్నాయా? అంటే వాతావరణ శాఖ మాత్రం అవుననే సమాధానం చెబుతోంది. రానున్న రోజుల్లో మరో తుఫాన్ ప్రభావం పొంచి ఉందని వెల్లడించింది. ఇంతకీ ఎప్పుడు ఈ తుఫాన్ వచ్చే అవకాశం ఉంది. వర్షాలు ఎప్పటి నుంచి పడనున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బంగాళాఖాతంలో మరో అల్పపీడన ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. డిసెంబర్ 16న ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని అంచనా వేస్తోంది. డిసెంబర్ 18నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని వెల్లడించింది. ప్రస్తుతానికి చూస్తే ఈ అల్పపీడన ఆవర్తనం శ్రీలంక, తమిళనాడు, ఏపీ వైపుగా కొనసాగుతోందని ఐఎండీ అంచనా వేసింది. అల్పపీడనం భారీ తుఫాన్ గా మారే అవకాశం కూడా ఉందని చెబుతోంది. ఇదే జరిగితే మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్పపీడనం తుఫాన్ గా మారితే మాత్రం డిసెంబర్ 21 నుంచి 25వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అందుకే రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే వాతావరణం ఎఫ్పుడు ఎలా కదులుతుందో చెప్పలేం.ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. కాగా ఈమధ్య మిచౌంగ్ తుఫాన్ ప్రభావం వల్ల రైతులుభారీగానే నష్టపోరారు. ఇప్పుడు ఈ నష్టం నుంచి తీరుకోక ముందే ఏపీకి మరో తుఫాన్ రూపంలో ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కోస్తాలోనూ వర్షాలు కురిశాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గోదావరి జిల్లాలతో సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడ్డాయి.
ఇది కూడా చదవండి: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని.. ప్రాజెక్టులోకి దూసుకెళ్లాడు..