/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Pravalika-Issue-jpg.webp)
Pravalika News: ఇటీవల నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం (Pravalika Issue) తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వరుసగా ప్రభుత్వ నియామక పరీక్షలు వాయిదా పడడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందంటూ నిరుద్యోగులు భారీగా ఆందోళనలు చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిపక్షాల నేతలు కూడా ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే.. పోలీలు మాత్రం ప్రేమ విఫలం కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తేల్చడం కూడా సంచలనం సృష్టించింది. ఆమె ప్రియుడికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరగడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అందరినీ షాక్ కు గురి చేసింది.
ఇది కూడా చదవండి: Pravalika Suicide: ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు
నిక్కర్ పార్టీతో జత కట్టిన లిక్కర్ పార్టీ..
👉 గత కొంత కాలంగా బీజేపీ వాళ్ళు రాసిచ్చిన అబద్ధాలను ప్రచారం చేస్తున్న కేటీఆర్.
👉 బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి, వాళ్లేం చెప్తే అదే చెప్తున్నారు.
👉 ప్రవళిక గ్రూప్ టూ కే అప్లై చేయలేదని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదం.#LooTR #ByeByeKCR pic.twitter.com/pL5hKfyFIa
— Telangana Congress (@INCTelangana) October 16, 2023
ఇప్పటివరకు ప్రవళిక గ్రూప్స్ పరీక్షలే రాయలేదని ఆయన చెప్పారు. 15 రోజుల క్రితమే ప్రవళిక హైదరాబాద్ వచ్చిందని తేల్చేశారు. ప్రవళిక ఆత్మహత్య తర్వాత ఆందోళన చేసిన వారిని, రెచ్చగొట్టిన వారందరిపైనా కేసులు పెడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు ఇలా చెప్పారని.. ఇది దుర్మార్గమని ఆ సమయంలో వివిధ పక్షాల నేతలు దుమ్మెత్తిపోశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవళిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు.
దీనికి మీ స్పందన ఏంటి @KTRBRS గారు?
విద్యార్ధిని ప్రవల్లిక గ్రూప్స్ పరీక్షలకు అసలు అప్లై చేయలేదు అన్నారు. మరి దీనిపై మీ స్పందన ఏంటి? మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని విషయంలో వ్యక్తిగత దాడికి పాల్పడుతోంది @BRSparty ప్రభుత్వం.#Pravallika… pic.twitter.com/7qwWzd06dS
— 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@JSPTelangana) October 16, 2023
#pravallika Applied for all the Groups exams Group 1,2,3,4 and DAO also. అమ్మాయి ఆత్మహత్య చేసుకోగానే ఆమె ఫోన్ ఛాట్స్ లోకి వెళ్లి, ఆమె ఓ అబ్బాయితో టిఫిన్ చేస్తూ కనిపించిందని సీసీ ఫుటేజీ బయటకు తీసిన తెలంగాణ పోలీసులు DCP వెంకటేశ్వరరావు గారు, బెడ్ కింద లవ్ సింబల్స్ ఉన్న లెటర్… pic.twitter.com/H26G7tLcbL
— ThulasiChandu (@thulasichandu1) October 15, 2023
Pravllika is Preparing for government jobs... Here is the Proof..!
The 23 Year Student Pravallika who Committed Suicide has been applied for Group 1, 2, 3, 4 , DAO and RRB Exams.#Pravallika pic.twitter.com/YeAdyqvw2z
— Team Congress (@TeamCongressINC) October 15, 2023
రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్వయంగా వచ్చి ప్రవళికను పరామర్శిస్తారని చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. ప్రవళిక ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు ప్రవళిక గ్రూప్-1, 2, 3, 4 కు అప్లై చేసిందని.. ఇందుకు సంబంధించిన టీఎస్పీఎస్సీ (TSPSC) పత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కేటీఆర్ ను ట్యాగ్ చేసి ఇప్పుడు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ అంశంపై అధికారులు, టీఆర్ఎస్ వర్గాలు ఎలా స్పందిస్తారన్న అంశంపై చర్చ సాగుతోంది.