పశ్చిమ బెంగాల్‌లో మరో రైలు ప్రమాదం

పశ్చిమ బెంగాల్‌లో మరో రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటన బంకురాలో చోటుచేసుకుంది. గూడ్సు రైలును వెనకనుంచి వచ్చి మరో రైలు ఢీకొట్టింది. దీంతో 12 బోగీలు పట్టాలు తప్పిన్నాయి. ఈ ప్రమాదంలో పలు రైళ్లకు అంతరాయం ఏర్పాడింది.

New Update
పశ్చిమ బెంగాల్‌లో మరో రైలు ప్రమాదం
Another train accident in West Bengal

రెండు గూడ్సు రైళ్లు ఢీ

పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలో రెండు గూడ్సు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వండా స్టేషన్‌లో ఓ రైలును మరో రైలు వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ గూడ్సు రైలు డ్రైవర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో గూడ్సు రైళ్లు ఖాళీగా ఉన్నాయి. అయితే, రైళ్లు రెండూ ఒకే ట్రాక్‌పైకి ఎలా వచ్చాయన్న విషయంలో స్పష్టత లేదు.

వరస ప్రమాదాలు

ప్రమాదంతో అడ్రా డివిజన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనులు చేపట్టారు. కాగా, ఈ నెల 2న ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 292 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఇది మిగిలిపోయింది.

Advertisment
తాజా కథనాలు