ACCIDENT: అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం.. న్యూయార్క్ యూనివర్సిటీ ప్రగాఢ సానుభూతి! అమెరికాలో మరో తెలుగు విద్యార్థి అకాల మరణం చెందాడు. న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న ఏపీకి చెందిన బీలం అచ్యుత్ బుధవారం సాయంత్రం బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అచ్యుత్ మరణంపై యూనివర్సిటీ ప్రగాఢ సానుభూతి తెలిపింది. By srinivas 23 May 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి America: ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లిన మరో తెలుగు విద్యార్థి మరణించాడు. న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న ఏపీకి చెందిన బీలం అచ్యుత్ బుధవారం సాయంత్రం బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘అచ్యుత్ బైక్ యాక్సిడెంట్ లో బుధవారం మధ్యాహ్నం మరణించాడు. అతడి అకాల మరణంపై చాలా బాధించింది. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. అచ్యుత్ ఫ్యామిలీ, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుకు అన్ని రకాల సహకారాలు అందిస్తాం’ అని కాన్సులేట్ జనరల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. #america #telugu-student-died మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి