/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-25T141742.150-jpg.webp)
America: ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లిన మరో తెలుగు విద్యార్థి మరణించాడు. న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న ఏపీకి చెందిన బీలం అచ్యుత్ బుధవారం సాయంత్రం బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘అచ్యుత్ బైక్ యాక్సిడెంట్ లో బుధవారం మధ్యాహ్నం మరణించాడు. అతడి అకాల మరణంపై చాలా బాధించింది. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. అచ్యుత్ ఫ్యామిలీ, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుకు అన్ని రకాల సహకారాలు అందిస్తాం’ అని కాన్సులేట్ జనరల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.