Breaking : టీడీపీకి మరో షాక్..చర్చలకు నిరాకరించిన గవర్నర్..!!

టీడీపీ నేతలకు మరో గట్టి షాక్ తగిలింది. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై గవర్నర్ తో చర్చించాలని టీడీపీ నేతలు భావించారు. అచ్చెన్నాయుడితో కూడిన 11మంది బ్రుందం గవర్నర్ ను కలవాలనుకుంది. అయితే టీడీపీ నేతలతో చర్చలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నిరాకరించారు. 

New Update
Breaking :  టీడీపీకి మరో షాక్..చర్చలకు నిరాకరించిన గవర్నర్..!!

టీడీపీ నేతలకు మరో గట్టి షాక్ తగిలింది. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై గవర్నర్ తో చర్చించాలని టీడీపీ నేతలు భావించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో కూడిన 11మంది బృందం గవర్నర్ ను కలవాలనుకుంది. అయితే టీడీపీ నేతలతో చర్చలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నిరాకరించారు.

మరోవైపు చంద్రబాబుపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. స్కిల్ కేసులో ఇరికించి చంద్రబాబు నాయుడుతో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదని మండిపడ్డారు. ఇది ఏపికి చీకటి రోజుగా భావిస్తున్నాం అని అసహనం వ్యక్తం చేశారు. 2016లో జీవో ఇచ్చారు. 5 ఏళ్ల పాటు ఎంతోమందికి ఉపాధి లభించిందని గుర్తు చేశారు. సీమెన్స్ ద్వారా షెల్ కంపెనీల డబ్బు చంద్రబాబుకి చేరిందని అభియోగం చేశారు. ఇది చాలా తప్పు అని ఆయన అన్నారు. సీఐడీ చీఫ్ ప్రెస్ మీట్‌లో చెప్పిన విషయాలే రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపరిచారని మండిపడ్డారు. సీఐడీ సీఎం జగన్ చేతిలో కీలు బొమ్మగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ఏళ్ల క్రితమే ఈ కేసు పెట్టారు. అప్పుడు లేని పేర్లు ఇప్పుడు ఎందుకు పెట్టారు..? అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: G20లో స్పెషల్ అట్రాక్షన్‌గా వాల్ పోస్టర్..ఇందులో ప్రత్యేకత ఏంటంటే..!!

న్యాయస్థానంలోనే తెల్చుకుంటాం:
ఇప్పుడు తాజాగా మళ్ళీ రీఓపెన్ చేసి కక్ష సాధింపు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో చంద్రబాబు కానీ, నేను కానీ ఏ వ్యక్తికి అయన లాభం చేకూర్చిమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాం అని సవాల్‌ చేశారు. కేవలం ఇది రాజకీయ కక్ష...కేసులకి టీడీపీ నేతలు భయపడరని ధీమ వ్యక్తం చేశారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్ మోహన్‌రెడ్డి ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ తన తండ్రి పదవి అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం నిర్మించుకున్నారు. రాష్ట్రంలో డై వెర్షన్ పోలటిక్స్‌గా భావిస్తున్నాం అని అయన అన్నారు. న్యాయస్థానంలోనే తెల్చుకుంటాం అన్నారు. ఫార్మర్ సీఎం అయిన చంద్రబాబునీ అరెస్ట్ చేయాలంటే గవర్నర్ సంతకం తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన రిషి సునక్, భార్య అక్షతామూర్తి..!!

Advertisment
తాజా కథనాలు