Karnataka: కర్ణాటకలో కరోనా స్కామ్.. రూ.1000 కోట్లు స్వాహా !

కర్ణాటకలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా సమయంలో కొన్ని కీలక డ్యాకుమెంట్లు కనిపించకుండా పోయాయని, నిధులు దుర్వినియోగం అయ్యాయని జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ గుర్తించింది. మొత్తం రూ.1000 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది.

New Update
Karnataka: కర్ణాటకలో కరోనా స్కామ్.. రూ.1000 కోట్లు స్వాహా !

కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం రేపుతోంది. కరోనా సమయంలో కోట్లాది రూపాయల వరకు అక్రమాలు జరిగినట్లు తాజాగా ఓ నివేదిక బయటపెట్టింది. జస్టిస్ జాన్ మైఖెల్ అనే కమిటీ ఈ స్కామ్‌కు సంబంధించిన నివేదికను కర్ణాటక సర్కార్‌కు సమర్పించింది. కొన్ని కీలక డ్యాకుమెంట్లు కనిపించకుండా పోయాయని, కొవిడ్ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఈ కమిటీ గుర్తించింది. దీనిపై కేబినెట్‌లో చర్చించిన సిద్ధరామయ్య ప్రభుత్వం.. బీజేపీ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

ఇదిలాఉండగా ప్రస్తుతం సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ముడా స్కామ్‌లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఆయన తన భార్య పార్వతమ్మ పేరిట మైసూరులో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు - విజయనగర స్థలాలు కేటాయించింది. అయితే ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలతో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) అధికారులు పార్వతమ్మకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు అప్పగించారని బీజేపీ విమర్శలు చేసింది. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఇటీవల ముడా స్కామ్ సంచలనం రేపింది. సిద్ధరామయ్య ప్రభుత్వంపై నెటీజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ నేత, మాజీ సీఎం యడియూరప్ప హయాంలో జరిగిన అవకతవకలు బయటపడ్డాయి.

Also read: తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేశ్‌ కుమార్ గౌడ్

కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై సీఎం సిద్ధరామయ్య చర్చించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొవిడ్ స్కామ్‌లో ఆయన కీలక విషయాలను గుర్తించారని పేర్కొన్నాయి. కరోనా సమయంలో వందల కోట్ల దుర్వినియోగం, కొన్ని కీలక పత్రాలు మిస్ అయ్యాయని జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీ గుర్తించినట్లు సిద్ధరామయ్య కేబినేట్ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కొవిడ్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన మొత్తం విలువ రూ.13 వేల కోట్లు. కానీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఇందులో మొత్తం రూ.1000 కోట్లు స్వాహా అయినట్లు సమాచారం. అయితే ఇప్పుడు వచ్చిన ప్రాథమిక నివేదికకు రానున్న ఆరు నెలల్లో తుదిరూపు ఇవ్వనున్ననారు.

పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఈ రిపోర్టును సమర్పించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ముడా స్కామ్ వచ్చిన తరుణంలోనే కొవిడ్ స్కామ్ బయటపడటంతో మీడియా అడిగిన ప్రశ్నలపై న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ అసహనం వ్యక్తం చేశారు. ముడా వ్యవహారంపై విమర్శలు వస్తుండటం రెండు నెలలు కూడా కాలేదని.. కానీ జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీని ఏడాది క్రితమే ఏర్పాటు చేశారని చెప్పారు.ఈ రెండు వ్యవహారాలను ఎలా పోలుస్తురాని ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు.

Also Read: లంచం అడిగితే మాకు చెప్పండి.. TGSPDCL కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు