Flight : కొద్దిరోజుల క్రితం లండన్ (London) నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్ లైన్స్ (Singapore Airlines) విమానం తీవ్ర కుదుపులకు గురై ఓ వృద్దుడు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ విమానాన్ని థాయ్‌లాండ్ (Thailand) రాజధాని బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే తాజాగా మరో విమానం ఎయిర్ టర్బులైన్స్ (Air Turbulence) కు గురైంది. దోహా(ఖతార్ ) నుంచి ఐర్లాండ్ లోని డబ్లిన్ కు వెళ్తున్న ఖతార్ ఎయిర్ వేస్ విమానం మార్గమధ్యంలో టర్కీ గగనతలంలో తీవ్ర కుదుపులకు గురైంది.
ఎయిర్ టర్బులెన్స్ సంభవించడంతో విమానం అంతా ఒక్కసారిగా గగనతలంలో ఊగిపోయింది. దాంతో విమానంలోని 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఆరుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి రావడంతో విమానం ముందుకు వెళ్లింది. డబ్లిన్ లో సాఫీగా ల్యాండైంది.
Also read: తెలంగాణలో భారీ వర్షాలు..వేరువేరు ఘటనల్లో పది మంది మృతి!