B Virus: బీ కేర్ ఫుల్.. కొత్త వైరస్‌ కలకలం..

కోతుల నుంచి మరో కొత్త వైరస్‌ వస్తోంది. కోతి స్క్రాచ్ చేయడంతో ఈ వైరస్ సోకుతుంది. దీన్ని బీ-వైరస్‌ అని పిలుస్తున్నారు. ఈ వైరస్‌ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెల్లండి.

B Virus: బీ కేర్ ఫుల్.. కొత్త వైరస్‌ కలకలం..
New Update

B Virus From Monkeys: ప్రపంచమంతా వైరస్‌లమయంగా మారుతోంది. మరో కొత్త వైరస్‌ గురించి నేడు తెలుసుకుందాం. ఇది కోతుల నుంచి వస్తుంది. కోతి మిమ్మల్ని స్క్రాచ్ చేస్తే సోకుతుంది. దీన్ని బీ-వైరస్‌ అని పిలుస్తున్నారు. ఈ వైరస్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలు తెలుసుకుందాం..

హాంకాంగ్‌లోని (Hong Kong) ఓ పార్కులో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక కోతి అతడిని కరిచింది. ఈ ఘటన తర్వాత ఈ వ్యక్తికి ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ వచ్చింది. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఇన్ఫెక్షన్ బీ-వైరస్ వల్ల వస్తుంది. హాంకాంగ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసించే కోతుల ఉమ్మి, మూత్రం, మలంలో ఇది కనిపిస్తుంది.

Also Read: పైపైకే అంటున్న బంగారం..టాప్ లేచిపోతోంది

బి-వైరస్‌ను మంకీ బి వైరస్ లేదా హెర్పెస్ వైరస్ (Herpes Virus) సిమియే అని కూడా అంటారు. ఈ వైరస్ మనిషికి సోకడం చాలా అరుదు. ఈ వైరస్ 1932లో కనుగొనబడింది. 2019 వరకు కేవలం 50 మందికి మాత్రమే ఈ వైరస్ సోకింది. అందులో 21 మంది చనిపోయారు. కోతులు కరిచినా, గోర్లతో గీసినా ఈ వైరస్‌ సోకుతుంది.

బీ-వైరస్ ప్రారంభ లక్షణాలు ఫ్లూ లాగా ఉన్నాయి. జ్వరం వస్తోంది. చలిగా అనిపిస్తుంది. కండరాల నొప్పి, అలసట, తలనొప్పి వస్తాయి. తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. విశ్రాంతి లేనట్టు అనిపిస్తుంది. వాంతులు, కడుపు నొప్పి, ఎక్కిళ్ళు కూడా సంభవించవచ్చు. ఈ వైరస్ సంక్రమణను నయం చేయడానికి యాంటీ-వైరల్ మందులను ఉపయోగిస్తారు. అయితే ప్రాణాలు నిలబడాయని గ్యారెంటీ మాత్రం లేదు!

#rtv-news-telugu #monkey #b-virus
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe