AP Files Burnt: ఏపీలో వరసగా పైళ్ల దగ్ధం ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో శాఖలో ఫైళ్లు దగ్ధం అయ్యాయి. విజయవాడలోని నీటిపారుదల అభివృద్ది సంస్థ కార్పొరేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న అర్ధరాత్రి కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదంలో ముఖ్యమైన రికార్డులు, ఫైల్స్, కంప్యూటర్స్ కాలిపోయాయి. కావాలనే అగ్గి పెట్టారా? లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
విజయవాడ, శ్రీకాకుళం , ఏలూరు, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు , విజయనగరంల్లో సంస్థకు మొత్తం 8 బ్రాంచ్‌లు ఉన్నాయి. అన్నిటికీ హెడ్ క్వార్టర్స్ విజయవాడలోనే ఉంది. ఇక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. డేటా అంతా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మొత్తం 36 మంది ఉద్యోగులు పనిచేస్తారు. 24 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్, 12 మంది రెగ్యులర్ ఎంప్లాయిస్ ఉన్నారు. షాక్ సర్క్యూట్ కారణం తరచూ లిఫ్ట్ ప్రాబ్లం వస్తుందని ఉద్యోగులు చెప్పారు. రికార్డులు ,కంప్యూటర్లు, ఏసీలు, ఫైల్స్ మొత్తం పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలిపారు.
Also Read: చంద్రబాబును మెచ్చుకున్న కేటీఆర్.. ఎందుకో తెలుసా?