చిక్కిన భారీ మీనం....జాలరి సంబరం చేపలలో రారాజు పండగప్ప. ఈ చేపలనే ఆసియా సీబస్ లేదా బర్రముండి అని అంటారు. సముద్రపు ఉప్పు నీటిలో, మంచి నీటి నదులలో పెరగడం వీటి ప్రత్యేకత.ఈ చేపకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. దాంతో జాలరులు సైతం ఇప్పుడు దాన్ని పెంచుకునేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా...అంబేద్కర్ కోనసీమ జిల్లా మత్య్సకారులకు సముద్రంలో భారీ పండగప్ప చేప లభ్యం అయింది. దాంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. By Vijaya Nimma 05 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి చిక్కిన పండగప్పను రారాజు చేప సముద్ర చేపల రుచుల్లో పండగప్పను రారాజు అంటారు. ఎందుకంటే దీని మాసం అంత రుచికరంగా ఉంటుంది. అలాంటి పండగప్ప చేప దొరకడంతో వారు సంతోషంలో ఉన్నారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెం వద్ద భారీ పండగప్ప సముద్రంలో మత్స్యకారుల వలకు చిక్కింది. 24 కేజీల చేప..రూ.25 వేలు ధర అంతేకాకుండా మామూలుగా అయితే సముద్ర తీర ప్రాంతంలో 2 కేజీల నుంచి 10 కేజీల వరకు పండగప్పచేపలు కొన్నికొన్నిసార్లు జాలరులకు వలలో దొరుకుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు దొరికిన చేప బరువు మాత్రం 24 కేజీలు. గతంలో ఇరవై, పదిహేను కేజీలు ఉన్న పండుగప్పలు సముద్రంలో జాలరులకు దొరకగా ఇప్పుడు 24 కేజీల పండుగప్ప దొరకడంతో దీన్నిచూడడానికి, కొనడానికి చాలామంది ఉత్సకత చూపించారు. దాంతో దీన్ని వేలం వేశారు. యానాంకు చెందిన మత్యకారుడు మహిపాల చిన్న అనే వ్యక్తి 17,500/ రూపాయలకు వేలం పాటలో దక్కించుకున్నాడు. ఈ చేప ఎంత బరువు ఉంటే అంత రేటు పలుకుంది. ఇప్పుడు దొరికిన ఈ చేపను అమ్మితే మాత్రం సుమారు 25 వేల రూపాయల వరకు వస్తుందని చిన్నా చెబుతున్నారు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే చేప మంచినీటి పండుగప్పలు, నల్ల పండుగప్పలు, ఉప్పుపండుగప్పలు, తెల్ల పండుగప్పలు, మచ్చల పండుగప్పలు, ఎర్ర పండుగప్పలు అంటూ వీటిలో కూడా రకాలు ఉన్నాయి. అయిన్పటికీ వాటి రుచిలో ఏమాత్రం తేడా ఉండదని అంటున్నారు మాంసప్రియులు. ఈ పండుగప్ప చేపకు వెన్నుపూస ముల్లు మాత్రమే ఉంటుంది దాంతో ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.. అంతేకాకుండా ఈ చేపను తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు కూడా అధిక సంఖ్యలో లభిస్తాయి. ఇలా రుచికరంగానూ, ఆరోగ్యపరంగానూ ప్రయోజనాలు ఉండడంతో ఈ చేపలకు మంచి డిమాండ్ ఉంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి