/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/road-accident-in-Karimnagar-district-Three-people-is-died-jpg.webp)
Road Accident:హైదరాబాద్ మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జిపై మరో హిట్ అండ్ రన్ కేసు చోటుచేసుకుంది. కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు చికిత్స పొందుతూ చనిపోగా.. మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అనిల్, అజయ్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢీకొట్టి పరారైన వారి కోసం వెతుకున్నారు. సీసీ ఫుటేజ్‌లో పరిశీలించిన పోలీసులు.. ఢీకొట్టిన కారు నంబర్ AP28DV7999 నెంబర్ గా గుర్తించారు. రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.