/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/5HmRUI8LifE-HD.jpg)
TG DSC: తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్ వేయబోతున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 5 నుంచి 6వేల పోస్ట్ లతో డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే 11,062 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా, మరో డీఎస్సీ ప్రకటించడంపై అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇందులో భాగంగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇక నెల 18 నుంచి జరగనున్న డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భట్టి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Hon'ble Deputy Chief Minister Bhatti Vikramarka Press Meet Live https://t.co/0GvAODc5fb
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) July 14, 2024