TVS: మార్కెట్లోకి మరో CNG టీవీఎస్ జూపిటర్ స్కూటర్..! TVS జూపిటర్ 125 CNG స్కూటర్ ను ఈ ఏడాది చివరలో రిలీజ్ చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.TVS ప్రారంభంలోనే 1000 స్కూటర్ల వరకు అమ్మకాలు జరపాలని లక్ష్యంగా పెట్టుకుంది.అయితే ఇప్పటికే మార్కెట్లో పెట్రోల్,ఎలక్ట్రికల్ స్కూటర్లు నడుస్తున్నాయి. By Durga Rao 11 Jul 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి TVS Jupiter CNG: ప్రస్తుత టూవీలర్ మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే ఉన్నాయి. అయితే, త్వరలో CNG టెక్నాలజీతో పాపులరయిన 125సీసీ స్కూటర్ రానుంది.వీఎస్ జూపిటర్ 125.. మోటార్‌సైకిల్ సెగ్మెంట్ ఇటీవలే ఫస్ట్సీఎన్‌జీ మోడల్ బజాజ్ ఫ్రీడమ్ 125ను ప్రకటించింది. ప్రపంచంలోనే ఫస్ట్ CNG బైక్ కూడా. ఆటోకార్ ప్రొఫెషనల్ నివేదిక ప్రకారం..TVS సంవత్సరాలుగా వివిధ ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలపై పనిచేస్తోంది. ఇప్పటికే సీఎన్‌జీ ఆప్షన్ అభివృద్ధి చేసింది.టీవీఎస్ జూపిటర్ 125కి సీఎన్‌జీ టెక్నాలజీని అందిస్తుంది. సీఎన్‌జీ స్కూటర్ ఉత్పత్తి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభం కావచ్చని నివేదికలో తెలిపింది. జూపిటర్ 125 సీఎన్‌జీ భారత మార్కెట్లో2024 చివరిలో లేదా 2025 మొదటి ఆరు నెలల్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. TVS ప్రారంభంలో నెలకు 1,000 యూనిట్ల సీఎన్‌జీ స్కూటర్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం, టీవీఎస్ జూపిటర్ 125 124.8సీసీ, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 8.2పీఎస్ గరిష్ట శక్తిని, 10.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ సీవీటీ ఆటోమేటిక్‌తో వస్తుంది. వేరియంట్ వారీగా టీవీఎస్ జూపిటర్ 125 ధరలు (ఎక్స్-షోరూమ్) కింది విధంగా ఉన్నాయి. డ్రమ్ – అలోయ్ రూ. 79,299,డిస్క్ రూ. 84,001,స్మార్ట్ ఎక్స్‌నెక్ట్ రూ. 90,480 రేట్లతో రానున్నాయి. Also Read: 1 లక్ష బడ్జెట్ లో ఇంటర్నేషనల్ ట్రిప్స్.. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు..! #cng-bike #tvs-jupiter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి