TS Jobs: త్వరలో 14 వేల ఉద్యోగాలకు ప్రకటన.. మంత్రి సీతక్క శుభవార్త!

New Update
TS Jobs: త్వరలో 14 వేల ఉద్యోగాలకు ప్రకటన.. మంత్రి సీతక్క శుభవార్త!

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి సీతక్క. త్వరలోనే అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. సోమవారం మంత్రి సీతక్క ఈ అంశంపై మాట్లాడారు. రాష్ట్రంలో 4వేల మినీ అంగన్ వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలనుగా మార్చినట్లు వెల్లడించారు. ములుగులోని తన క్యాంపు ఆఫీసులో ఫిర్యాదుల బాక్సు ఏర్పాటు చేయనున్నట్లు సీతక్క తెలిపారు. మహాలక్ష్మీ పథకం గురించి ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న సీతక్క..త్వరలోనే వారి సంఘాలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చర్చిస్తుందని తెలిపారు. తర్వాతే హామీ ఇస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12వేలు ఇస్తామని ఈ సందర్భంగా సీతక్క చెప్పారు.

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. 1890 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణలో మరో 1890 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. గతేడాది డిసెంబర్ 30, 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి కొనసాగింపుగా మరో 1890 పోస్టులను కలిపి మొత్తం 7094పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక మండలి అనుమతి ఇచ్చింది. తాజా నిర్ణయం మేరకు ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ డైరెక్టరేట్ పరిధిలో వైద్యవిద్యాసంచాలక పరిధిలో 5,650 పోస్టులు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 757 పోస్టులు , ఎంఎన్ జే ప్రాంతీయ క్యాన్సర్ ఆసుపత్రిలో 81, దివ్యాంగుల సంక్షేమశాఖ పరిధిలో 8, మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 127, బీసీగురుకుల సంస్థ పరిధిలో 260 , గిరిజన గురుకుల సంస్థ పరిధిలో 74, ఎస్సీ గురుకుల సంస్థ పరిధిలో 124, తెలంగాణ గురుకుల సంస్థ పరిధిలో 13పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. 

కాగా ఇందులో జోన్ 1 పరిధిలో 937, రెండో జోన్ లో 1044 ఉండగా..మూడో జోన్లో 1023, నాలుగో జోన్లో 719, అయిదో జోన్లో 1305 , ఆరోజోనులో 948 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 2100 ఓసీ పోస్టులు ఉండగా…ఈడబ్ల్యూఎస్ 653, బీసీ ఎ 612, బీసీ బి 686, బీసీ సి 81, బీసీ డి 466, బీసీ ఇ 330, ఎస్సీ 1041,ఎస్టీ 690, స్పోర్ట్స్ కోటాలో 114, దివ్యాంగుల కోటాలో 311 పోస్టులు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం పోస్టుల్లో మూడో వంతు మహిళలతో భర్తీ చేస్తామని సర్కార్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: మరో 50 మంది ఎంపీలు ఔట్.. స్పీకర్ సంచలన నిర్ణయం!

Advertisment
తాజా కథనాలు