/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T122923.989.jpg)
Annamayya District : అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ కలకలం (Gun Fire) చోటుచేసుకుంది. చిన్నమండెం మండలం బోనమలకు చెందిన రాజగోపాల్ అనే వ్యక్తి నాటు తుపాకీతో దారుణంగా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజగోపాల్ ఇటుకల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. అప్పుల బాధ తట్టుకోలేక రాజగోపాల్ తుపాకీతో కాల్చుకొని చనిపోయినట్లు తెలుస్తోంది. సంఘటన జరిగిన స్థలంలోనే నాటు తుపాకీ దొరికింది.
Also Read: Hyderabad: మూడంతస్తుల బిల్డింగ్‌పై నుంచి పడ్డ కానిస్టేబుల్.. చివరికి - Rtvlive.com