kanyashulkam web series :మధుర వాణిగా అంజలి .. వేదంలో అనుష్క ను మరిపిస్తుందా ?

కన్యాశుల్కం నవల వెబ్ సిరీస్ గా అలరించనుంది. హీరోయిన్ అంజలి మధురవాణిగా , గిరీశమ్ పాత్రలో అవసరాల శ్రీనివాసరావు నటిస్తుండగా క్రిష్ ఈ సిరీస్ నిర్మయిస్తున్నారు. త్వరలో .జీ 5 లో ప్ర‌సారం కానున్న ఈ వెబ్ సిరీస్ శేష సింధూరావు డైరెక్ట్ చేశారు.

kanyashulkam web series :మధుర వాణిగా అంజలి .. వేదంలో అనుష్క ను మరిపిస్తుందా ?
New Update

kanyashulkam web series :తెలుగు నాట అత్యంత ప్రజాధారణపొందిన నాటకం కన్యాశుల్కం. గురజాడ అప్పారావు కలం నుంచి జాలువారిన ఈ నాటకం ఇప్పటివరకు చాలా మంది ఈ నాటకాన్ని కొన్ని వేల సార్లు రంగస్థలంపై ప్రదర్శించారు. సినిమా, సీరియల్ గా కూడా కన్యాశుల్కం నాటకం ప్రజాదరణ పొందింది. ఈ నాటకంలో పాత్రలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేశాయి. గిరీశం, మ‌ధుర‌వాణి పాత్ర;అయితే ఇక చెప్పనవసరంలేదు. ఈ పాత్రల తీరు తెన్నులను స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది సినిమా పాత్రలను రాసుకున్నారంటే కన్యాశుల్కం ఎంతటి గొప్ప రచనో అర్థమయ్యే ఉంటుంది.

వెబ్ సిరీస్ గా రానున్న కన్యాశుల్కం

సినిమాగా , సీరియల్ గా అలరించిన ఈ నాటకం ఇప్పుడు వెబ్ సిరీస్ గా అలరించనుంది.డైరెక్టర్ క్రిష్ ఈ వెబ్ సిరీస్ కు నిర్మాణ సారథ్యం వహించారు. అయితే ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వ భాద్యతలు ఓ లేడీ డైరెక్టర్ కు అప్పగించారు. ‘చూసీ చూడంగానే’ మూవీతో దర్శ‌కురాలిగా ఆక‌ట్టుకొన్న శేష సింధూరావు ఈ వెబ్ సిరీస్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆరు ఎపిసోడ్స్ గా నిర్మించిన ఈ కన్యాశుల్కం వెబ్ సిరీస్ ఇప్పటికే .సిద్ధం అయింది.జీ 5 లో ప్ర‌సారం కానున్న ఈ వెబ్ సిరీస్ లో మ‌ధుర‌వాణిగా అంజ‌లి, గిరీశంగా అవ‌స‌రాల శ్రీ‌నివాస్ అలరించనున్నారు. .

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీకి బ్రేక్

ఇక.. క్రిష్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తిన్న మూవీ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీకి బ్రేక్ పడటంతో ఈ గ్యాప్ లో ఈ వెబ్ సిరీస్ నిర్మాణం చేపట్టారు. . ఇక.. ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసి త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ డేట్ ప్రకటిస్తారు.

మధుర వాణిగా అంజలి

క‌న్యాశుల్కం లాంటి గొప్ప న‌వ‌ల‌ని క్రిష్ నిర్మించడం. అందులోనూ అంజలి , అవ‌స‌రాల లాంటి లాంటి గొప్పన‌టీన‌టుల్ని సెలెక్ట్ చేసుకోవడంతో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కు ముందే క్రేజ్ సొంతం చేసుకుంది.మధుర వాణి గా అంజలి కి ఇది బెంచ్ మార్క్ క్యారక్టర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు . వేదం సినిమాలో అనుష్క పాత్రకి ఎంతటి మైలేజ్ వచ్చిందో అందరికి తెల్సిందే. ఆ పాత్రను తలదన్నే పాత్ర మధుర వాణి పాత్ర . ఇక..గిరీశం పాత్రకు నూరుశాతం యాప్ట్ అవసరాల అని చెప్పొచ్చు. చూడాలి వెబ్ సిరీస్ గా కన్యాశుల్కం ఏ మేరకు అలరిస్తోందో.

ALSO READ:Animal OTT: యానిమల్ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్?

#krish-jagarlamudi #kanyashulkam-web-series #avasarala-srinivasarao #anjali
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి