Animal Movie: డిలీట్ చేసిన రష్మిక సీన్స్‌ను కూడా చూడవచ్చు.. యానిమల్‌ ఓటీటీ డేట్‌ ఫిక్స్!

రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాను జనవరి 26న నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ చేయనుంది. నెట్ ఫ్లిక్స్ కోసం ఈ సినిమాను రీ-ఎడిటింగ్ చేస్తున్నట్లు సమాచారం. డిలీట్‌ చేసిన సీన్స్‌ను ఓటీటీలో యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Animal Movie: డిలీట్ చేసిన రష్మిక సీన్స్‌ను కూడా చూడవచ్చు.. యానిమల్‌ ఓటీటీ డేట్‌ ఫిక్స్!
New Update

Animal Movie:  అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న రిలీజైన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టింది. మ్యుఖ్యంగా ఈ సినిమాలో రణ్ బీర్ నటన హైలెట్ గా నిలిచింది. విడుదలైన మొదట్లో ఈ సినిమా పై పలు రకాల అభిప్రాయలు వినిపించాయి. కొంత మంది ప్రేక్షకులు సూపర్ హిట్ అనగా.. మరి కొంతమంది ఒకే.. ఒకే అన్నారు. యానిమల్ పై చాలా విమర్శలు కూడా వచ్చాయి. సినిమాలోని హింస, అసభ్యకరమైన సంభాషణల సన్నివేశాలను కొందరు విమర్శించారు. సినిమా పై మిక్స్డ్ టాక్ వినిపించినప్పటికీ.. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక థియేటర్స్ లో సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకున్న యానిమల్ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

యానిమల్ ఓటీటీ రిలీజ్

యానిమల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా జనవరి 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇప్పుడు యానిమల్ ఓటీటీ కంటెంట్ పై లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది.

Also Read: Mega Heroes: ఆ మూడు నెలలు మెగా ఫ్యాన్స్ కు పండగే.. వరుసగా మెగా సినిమాల సందడి

publive-image

డిలీట్ చేసిన రష్మిక సీన్స్

థియేటర్స్ లో 3 గంటల 21 నిమిషాల రన్ టైం తో ఈ సినిమా విడుదలైంది. అయితే థియేటర్ కోసం రష్మిక మందనకు సంబంధించిన కొన్ని సీన్స్ డిలీట్ చేశారట. కాగా ఓటీటీలోకి వచ్చే ముందు డిలీట్ చేసిన సన్నివేశాలు యాడ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి ప్రధాన పాత్రలో కనిపించారు.

publive-image

Also Read: Saindhav OTT Release: ఓటీటీలో వెంకటేష్ “సైంధవ్‌” సందడి.. స్ట్రీమింగ్ డేట్ ఆ రోజే ..?

#animal-ott-update #animal-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe