Animal Mass Record: పిచ్చ మాస్.. ఇరవైనాలుగు గంటలూ అదే.. యానిమల్ కొత్త రికార్డ్!

రణబీర్ కపూర్ సినిమా యానిమల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది కలెక్షన్ల రికార్డ్ కాదు. యానిమల్ సినిమా నడుస్తున్న స్క్రీన్స్ 24 గంటలూ రన్నింగ్ లో ఉంటున్నాయి. బాలీవుడ్ లో ఇలా 24/7 స్క్రీన్స్ ఓపెన్ ఉండడం ఇదే మొదటిసారి. 

Animal Mass Record: పిచ్చ మాస్.. ఇరవైనాలుగు గంటలూ అదే.. యానిమల్ కొత్త రికార్డ్!
New Update

Animal Mass Record: సినిమా అంటే ఇలా ఉండాలి అనే రూల్ పోయింది. ఇంతే ఉండాలి.. ఇంత సేపే ఉండాలి అనే విధానమూ పోయింది. మాస్ సినిమా అంటే అసలు ఇప్పుడు అర్ధమే మారిపోయింది. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న యానిమల్ సినిమాతో ఎంతో మార్పు. మాస్ సినిమాలకే బాప్ అనే రేంజిలో యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కొస్తోంది. అసలు ఏం సినిమారా బాబు అని ప్రేక్షకులు పదే పదే యానిమల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక బాహుబలి.. ఒక rrr, ఒక కేజీఎఫ్ ఈ సినిమాలే ఆమ్మో అనిపిస్తే.. యానిమల్ ఇంకా దానికన్నా పెద్ద పదం కోసం వెతుక్కోండి పోయి అనేసింది. సినిమా కలెక్షన్ల రికార్డులు తెలుసుకోవడం అనవసరం అనే రేంజిలో కలెక్షన్స్ వచ్చి పడిపోతున్నాయి. మూడు రోజుల్లో మూడొందల కోట్లు.. కానీ వినీ ఎరుగని కలెక్షన్స్. ఇక యానిమల్ చెరపలేని రికార్డులు సృష్టించేస్తుందని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే, ఆ రికార్డులు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. అవి చెరపలేరు అనడానికి లేదు. ఎప్పుడైనా చెరిగిపోవచ్చు. మళ్ళీ సందీప్ వంగ ఇంకో సినిమా దీనిని మించి తీయవచ్చు. కానీ, ఇప్పుడు యానిమల్ మరో సరికొత్త రికార్డ్ సృష్టించింది. అది మాత్రం ఎవరూ చెరిపే సాహసం ఇప్పుడప్పుడే చేయలేరు అనిపిస్తుంది. అనిపించడం ఏమిటి? చేయడం చాలా కష్టమే. ఏమిటా రికార్డ్ అంటారా?

Also Read: మొదటిదానిలో దేవా..రెండో దానిలో సలార్..ట్రైలర్ ఇరగదీయాల్సిందే

ఏదైనా సినిమా ఒక సినిమా థియేటర్(Animal Mass Record) లో ఎన్ని గంటలు ఉంటుంది. అంటే రోజుకు నాలుగు షోలు ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయి రాత్రి మహా అయితే 1 గంటకు క్లోజ్ అయిపోతాయి. సినిమా హాళ్లు మూతపడిపోయి మర్నాడు 10 గంటలకు ఓపెన్ అవుతాయి. అంతే కదా. కానీ, యానిమల్ సినిమా థియేటర్లు ముంబయి లో 24 గంటలూ తెరిచే ఉంటున్నాయి. మొదటి ఆట తెల్లవారు జామున 5:30 గంటలకు వేస్తున్నారట. చివరి షో పూర్తి అయ్యేసరికి మర్నాడు 5:30 అవుతుంది అంటే రౌండ్ ది క్లాక్ థియేటర్లు ఓపెన్ లోనే ఉంటున్నాయి. బాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకో ఏ సినిమాకు ఇటువంటి పరిస్థితి లేదు. ఇలా ఎందుకంటే.. యానిమల్ రాం టైం 3 గంటల 21 నిమిషాలు. రోజుకు 6 షోలు వేయాల్సిన పరిస్థితి ఉంది. సినిమా టాక్ రేంజ్ అలాంటిది. దీంతో తెల్లవారు జామున షో మొదలైతే మళ్ళీ మర్నాడు తెల్లవారు జామున షోస్ పూర్తి అవుతున్నాయి. ఇది ఇప్పడు ఒక రికార్డ్. ఇప్పుడు చెప్పండి ఇలా 24 గంటలు స్క్రీన్స్ ఓపెన్ ఉండేలాంటి సినిమా మళ్ళీ వస్తుందంటారా?


ఇదిలా ఉంటె.. ఇప్పటికి అంటే 5 రోజులల్లో యానిమల్(Animal Mass Record) సినిమా ప్రపంచ వ్యాప్తంగా 520 కోట్ల రూపాయలను వసూలు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇది ఇంకా కొనసాగుతోంది. మళ్ళీ వీకెండ్ వచ్చేసింది.. దీంతో 15 రోజుల లోపే వెయ్యికోట్ల కలెక్షన్స్ చేసిన తొలి భారతీయ సినిమాగా ఇది రికార్డ్ సృష్టిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమా తెలుగులో 30 కోట్లకు పైగా సంపాదించింది. ఇది ఒక రికార్డ్.

Watch this interesting Video:

#animal-movie #ranabeer-kapoor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe