Animal Collections రణబీర్ కపూర్ తన వైల్డ్ యాక్షన్ యాంగిల్ తో నెమ్మదిగా ప్రజల హృదయాలను శాసిస్తున్నాడు. డిసెంబర్ 1న విడుదలైన మచ్ ఎవైటెడ్ ఫిల్మ్ యానిమల్ ప్రకంపనలు సృష్టించింది. సల్మాన్ నటించిన టైగర్ 3ని కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొక్కేసి పైకి దూసుకుపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా క్రేజ్ కనిపిస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ తోనే బ్లాక్ బస్టర్ అవుతుందనే ఊహాగానాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూ వచ్చాయి. వాటిని నిలబెట్టుకుంటూ మొదటి రోజే బాక్సాఫీస్ మీద వైల్డ్ గా దాడి చేసింది. యానిమల్ దూకుడుకు మొదటిరోజు రికార్డులు బ్రేక్ చేసే సినిమాగా యానిమల్ నిలుస్తుందనే అంచనాలను పెంచేసింది.
భారతదేశంలోనే కాదు, రణబీర్ కపూర్ యానిమల్(Animal Collections) దేశం బయట కూడా విధ్వంసం సృష్టిస్తోంది. సినిమా కథతో పాటు అన్ని పాత్రల నటనకు కూడా మంచి స్పందన వస్తోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, యానిమల్ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.61 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.
యానిమల్ మొదటి రోజు కలెక్షన్ల బీభత్సం..
యానిమల్ హిందీలో మొత్తం 50 కోట్ల రూపాయల వ్యాపారం(Animal Collections) చేసింది. తొలిరోజు తెలుగులో 10 కోట్లు, తమిళంలో 0.4, కన్నడలో 0.09 వసూళ్లు రాబట్టింది. దీనితో, యానిమల్ సందడి ప్రపంచవ్యాప్తంగా చెక్కుచెదరకుండా ఉంది. ఇది మాత్రమే కాదు, ఇది రణబీర్ కపూర్‌కి అతిపెద్ద ఓపెనర్‌గా మారింది. సెన్సార్ బోర్డ్ నుంచి ‘ఎ’ సర్టిఫికెట్ కూడా పొందిన ఈ సినిమా పై విడుదలకు ముందే అంచనాలు జోరుగా ఉన్నాయి. ఈ సినిమా తొలిరోజు రూ.60 కోట్లు కలెక్ట్ చేయగలదని అందరూ ముందే లెక్కలు కట్టారు. దానికి తగ్గట్టుగానే 61 కోట్లరూపాయల వసూళ్లతో సునామీ సృష్టించింది.
Also Read: సందీప్‌రెడ్డి వంగ-రణబీర్ ‘యానిమల్’ మూవీ ఎలా ఉందంటే..? ట్విట్టర్ రివ్యూ ఇదే!
సందీప్ రెడ్డి వంగా హ్యాట్రిక్..
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాడు. సందీప్ రెడ్డికి ఇది మూడో సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్(Animal Collections) చూస్తే మతిపోతుందని అంచనాలు వేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా రెండో రోజే 100 కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయే అవకాశాలున్నాయి. . వారాంతాల్లో రణబీర్ అభిమానులు థియేటర్లలో ఎంత హంగామా సృష్టిస్తారనేదానిపైనే ఇప్పుడు అందరి ఆసక్తీ ఉంది.
Watch this interesting Video: