Animal Collections : యానిమల్ కాసుల వేట.. మూడు రోజుల్లో మూడువందల కోట్లు.. బాహుబలి రికార్డులు ఊదేస్తుందా? 

రణ్ బీర్ కపూర్ హీరోగా తాజాగా వచ్చిన యానిమల్ సినిమా 300 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం మూడు రోజుల్లోనే ఇది ఈ మార్క్ ను అందుకోవడం విశేషం. ఇక తెలుగులోనూ యానిమల్ మంచి కలెక్షన్లు రాబడుతోంది. 

New Update
Animal Collections : యానిమల్ కాసుల వేట.. మూడు రోజుల్లో మూడువందల కోట్లు.. బాహుబలి రికార్డులు ఊదేస్తుందా? 

Animal Collectionsబాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన యానిమల్ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సినిమా విడుదలై కేవలం 3 రోజులు మాత్రమే అయ్యింది. మూడు రోజుల్లో వసూళ్ల పరంగా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇండియాలో వీకెండ్ లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా 3 రోజుల్లోనే 200 కోట్ల మార్కును టచ్ చేసింది. ఇది రణబీర్ కపూర్ స్టార్ డమ్ అమాంతం టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. 

బాలీవుడ్ రిపోర్ట్స్  ప్రకారం, రణబీర్ కపూర్ యానిమల్ మూడవ రోజు అంటే ఆదివారం బంపర్ వసూళ్లు రాబట్టింది. ముందు నుంచీ ఊహించినట్టుగానే  మూడు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఈ చిత్రం విడుదలైన మూడో రోజు బాక్సాఫీస్ వద్ద 72.50 కోట్లు వసూలు చేసింది. తొలిరోజు యానిమల్ 63.8 కోట్లు రాబట్టింది. విడుదలైన రెండో రోజు ఈ చిత్రం 66.27 కోట్లు వసూలు చేసింది. అంటే ఈ సినిమా వసూళ్లు పెరిగాయన్నమాట. ఇండియాలో ఈ సినిమా వసూళ్లు 202.57 కోట్లుగా ఉన్నాయి. 

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ … రష్మిక (Rashmika Mandanna) జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ కు ఈ రేంజ్ కలెక్షన్స్(Animal Movie) ఎవరూ ఊహించలేదు. సినిమా హిట్ కావచ్చు అనుకున్నారు. రిలీజ్ రోజు కూడా సినిమాకి సూపర్ టాక్ రాలేదు. కొంత డివైడ్ టాక్ వచ్చింది. అయితే, కలెక్షన్లలో మాత్రం దుమ్ముదులిపింది. వీకెండ్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టింది.  యానిమల్ హిందీ, తెలుగులోనే ఈ రేంజ్ వసూళ్లతో దూసుకుపోతోంది. కానీ, మిగిలిన భాషల్లో మాత్రం వీక్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో సినిమా పెద్దగా వర్కౌట్ కావడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

Watch This Interesting Video :

Also Read: అదంతా అబద్ధం.. ఎందుకిలా చేశారో అర్థం కావట్లేదు : కృతి ఎమోషనల్

ఇదిలా ఉంటె తెలుగులో దిల్ రాజు ఈ సినిమా తీసుకువచ్చారు. 15 కోట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైట్స్ తీసుకున్నారు. రెండు రోజుల్లోనే ఆ మొత్తం ఆయనకు వచ్చేసింది. ఇక మూడోరోజు నుంచి వచ్చే కలెక్షన్లు లాభాలే. 

మొత్తంగా చూసుకుంటే.. యానిమల్ సినిమా ఆదివారం వరకూ మూడు రోజులకు 360 కోట్ల గ్రాస్ కలెక్షన్స్(Animal Collections) రాబట్టింది. రణబీర్ కపూర్ కెరీర్ లోనే అత్యంత వేగంగా మూడు వందల కోట్లు రాబట్టిన సినిమాగా ఇది నిలిచింది. యానిమల్ సినిమా వీకెండ్ లోనే రికార్డులు దులిపేసింది. ఇక సోమవారం నుంచి దీని కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది వేచి చూడాలి. బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుందా అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్న విషయంగా మారింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు