Animal 2nd Day Collections: బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం.. సునామీ ఇలా ఏదైనా తక్కువే అవుతుందేమో. ఎందుకో అర్ధం అయిందా.. అవును.. యానిమల్ సినిమా గురించే ఇది. అడవిలో జంతువులు వేటాడడం ఎంత కసిగా ఉంటుందో.. రణబీర్ సింగ్ యానిమల్ తో బాక్సాఫీస్ వద్ద అంత కసిగా.. వసూళ్ల వేట మొదలు పెట్టాడు. మొదటిరోజే వందకోట్ల దగ్గరకు చేరుకున్న యానిమల్ మూడోరోజు వచ్చేసరికి రెండొందల కోట్ల మార్క్ దాటడానికి సిద్ధం అయిపొయింది. భారతీయ సినిమా చరిత్రలో ఇంత స్పీడ్ కలెక్షన్స్ ఈ సినిమావే కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.
రణబీర్ కపూర్ సినిమా యానిమల్ విపరీతమైన క్రేజ్ తో దూసుకుపోతోంది. సినిమా విడుదలైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు తమ అభిమాన తారల నటనను చూసి అభిమానులు ఉత్కంఠతో ఉన్నారు. తొలిరోజే చారిత్రాత్మక కలెక్షన్లు రాబట్టి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది ఈ చిత్రం. సల్మాన్ ఖాన్ టైగర్ 3, షారుక్ ఖాన్ పఠాన్ కూడా యానిమల్ ముందు నిలబడలేకపోయాయి. మరి ఈ సినిమా మూడో రోజు బిజినెస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ నుంచి వచ్చిన తాజా రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.130 కోట్ల వసూళ్లను దాటేసింది. ఇప్పుడు యానిమల్ త్వరలో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరబోతోంది. మూడో రోజు ఈ సినిమా ఇప్పటి వరకు భారతదేశంలోని అన్ని భాషల్లో కలిపి రూ.9.42 కోట్లు వసూలు చేసింది. అయితే, ప్రస్తుతం ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.
Also Read: బాక్సాఫీస్ ను కుమ్మేసిన రణబీర్.. మొదటిరోజు ‘యానిమల్’ ఖాతాలో ఎంతంటే..
దీంతో ఓవరాల్ గా యానిమల్(Animal 2nd Day Collections) ఇండియాలో రూ.135.55 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పుడు మూడో రోజు ఈ సినిమా హిందీలో రూ.68 కోట్ల వసూళ్లు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అద్భుతాలు సృష్టిస్తోంది.
త్వరలో రూ.200 కోట్ల క్లబ్‌లో..
ఇదిలా ఉంటే, నివేదికల ప్రకారం, ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.198 కోట్లు వసూలు చేసింది. దీంతో పాటు విడుదలైన విక్కీ కౌశల్ సామ్ బహదూర్ బాక్సాఫీస్ వద్ద స్లో అయింది. విక్కీ సినిమాపై అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. విశేషమేమిటంటే యానిమల్ తొలిరోజే 100 కోట్ల గ్రాస్‌ను దాటేసి కలెక్షన్ల పరంగా చరిత్ర సృష్టించింది.
రణబీర్ ముందు విక్కీ విఫలమయ్యాడు
విక్కీ కౌశల్ సామ్ బహదూర్‌ని యానిమల్ పూర్తిగా తొక్కేసాడు. బాక్సాఫీస్ రిపోర్ట్ దీనిని స్పష్టం చేస్తోంది. రణబీర్(Animal 2nd Day Collections) సినిమా ఇప్పటివరకు 200 కోట్ల రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో బహదూర్ ఇప్పటి వరకు కేవలం రూ.16.23 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
మొత్తమ్మీద రణబీర్ కపూర్ - సందీప్ వంగా యానిమల్ సినిమాతో సరికొత్త చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు. ఇదే ట్రెండ్ కొనసాగితే.. యానిమల్ బాక్సాఫీస్ వద్ద రెండువేల కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
Watch this interesting Video: