SVC 58 : వెంకీమామతో ఐశ్వర్య, మీనాక్షి రొమాన్స్.. ఫస్ట్ లుక్స్ అదిరిపోయాయిగా!

విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా మూవీ టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వ‌ర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా వాళ్ళ ఫ‌స్ట్ లుక్స్ రిలీజ్ చేశారు.

SVC 58 : వెంకీమామతో ఐశ్వర్య, మీనాక్షి రొమాన్స్.. ఫస్ట్ లుక్స్ అదిరిపోయాయిగా!
New Update

Anil Ravipudi -  Venkatesh Movie Update : టాలీవుడ్ లో F2,F3 లాంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో వ‌స్తున్న ఈ చిత్రం కామెడీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పూజ కార్య‌క్రమాలు జరుపుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఐశ్వ‌ర్య రాజేష్ తో పాటు మీనాక్షి చౌదరి

ఇందులో వెంకీమామతో రొమాన్స్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర‌యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా మీనాక్షి చౌద‌రితో పాటు ఐశ్వ‌ర్య రాజేష్‌ల ఫ‌స్ట్ లుక్‌ల‌ను పంచుకుంది.

Also Read : పాన్ ఇండియా డైరెక్టర్ తో మోక్షజ్ఞ మూవీ ఫిక్స్.. నిర్మాతగా బాలయ్య, అనౌన్స్ మెంట్ ఆ రోజే!

ఇందులో ఐశ్వర్య రాజేష్ చీరకట్టులో పెళ్ళైన మహిళగా, మీనాక్షి మాత్రం స్టైలిష్ లుక్స్ లో కనిపించారు. దీన్ని బట్టి ఈ మూవీలో ఐశ్వ‌ర్య రాజేష్ వెంక‌టేశ్ భార్య‌గా న‌టించ‌నున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వ‌చ్చే వారం నుంచి ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

#meenkashi-chaudhary #aishwarya-rajesh #anil-ravipudi-venkatesh-3-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe