Anil Kumar Yadav: రాజకీయాల నుండి తప్పుకుంటా.. అనిల్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్.!

ఆనాడు తన సవాల్‌ను స్వీకరించినట్లైతే ఈనాడు రాజకీయాల నుండి తప్పుకుండేవాడినని అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకడు అని తాను అనలేదని అన్నారు. గెలుపోటములు ఎవరికైనా సహజమేనన్నారు.

Anil Kumar Yadav: రాజకీయాల నుండి తప్పుకుంటా.. అనిల్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్.!
New Update

Anil Kumar Yadav: ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గెలిచిన వాళ్ళు ప్రజలకు మంచి చెయ్యాలని.. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని వ్యాఖ్యానించారు. ప్రజలకు అందుబాటులో ఉంటామని.. తామెక్కడికి పారిపోమని అన్నారు. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదని.. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని కామెంట్స్ చేశారు. లోపాలు సరిదిద్దుకుని మళ్లీ ముందుకు వెళ్తామన్నారు.

Also Read: స్టాలిన్..నవీన్ పట్నాయక్..చంద్రబాబు కొత్త అడుగులు.. మారుతున్న రాజకీయ సంప్రదాయాలు

మంత్రుల నోటి దురుసు వల్ల ఓడిపోయారు అంటున్నారని.. అదే నిజం అయితే సరిదిద్దుకుంటామని చెప్పుకొచ్చారు. ఓడిపోతే కృంగిపోయి మూలన కూర్చునే పరిస్థితి ఉండదని.. జగన్ (YS Jagan) వెంటే ఉంటాం.. ఆయనతోనే నడుస్తామని పేర్కొన్నారు. అయితే, తమ కార్యకర్తలు, నాయకులపై దాడులు మంచి పద్దతి కాదని.. ప్రజలు అన్ని చూస్తున్నారని అన్నారు.

Also Read: మా ఓటమికి కారణం పవన్ : వైసీపీ ఎమ్మెల్సీ సంచలన ఇంటర్వ్యూ

ఈ క్రమంలోనే తాను రాజకీయాల నుండి తప్పుకుంటా అని ఛాలెంజ్ చేసానని అయితే, తన సవాల్ ను అవతల వాళ్ళు ఆనాడు స్వీకరించలేదని అన్నారు. ఆనాడు స్వీకరించినట్లు చెప్పి ఉంటే బాగుండేదని .. ఈ రోజు ట్రోల్ చెయ్యడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకడు అని తాను అనలేదన్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పదేళ్లు ఎమ్మెల్యేగా గెలవలేదని.. గెలుపోటములు ఎవరికైనా సహజమేనన్నారు. ఈ సారి ఓడిపోయిన వాళ్ళం వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని అన్నారు.

#ycp #ap-politics #anil-kumar-yadav
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe