Anganwadis strike in AP: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల సమ్మె వేడి ఇంకా కొనసాగుతోంది. జగన్ సర్కార్ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నెలరోజులకి పైగా ఆందోళనలు చేస్తున్నారు. ఇంతలా నిరసనలు వ్యక్తం చేస్తున్నాసరే జగన్ సర్కార్ స్పంధించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. అంగన్వాడీలు మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు.పూర్తి వివరాల్లోకి వెళితే ..
ALSO READ: సీఎం జగన్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ అడ్డగించిన అంగన్వాడీలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)ఈనెల 23న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)వెళ్లారు. అయితే ఉరవకొండ నియోజకవర్గంలో అంగన్వాడి వర్కర్లు ఒక్కసారిగా మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని, వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ముందుకు కదలకుండా అడ్డుకుని, రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అంగన్వాడీలను బలవంతంగా అక్కడినుంచి పక్కకు నెట్టి .. మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని ముందుకు పంపించారు. నెల రోజులకు పైగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు చేస్తున్న కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: చంద్రబాబు బెయిల్ రద్దు కేసు.. విచారణ వాయిదా