Anganwadi Workers : కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన..ఉరివేసుకుని మరి..!

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన పదో రోజుకు చేరుకుంది. జగన్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోన తమ సమస్యలు పరిష్కరించాలని నంద్యాల జిల్లాలో అంగన్వాడీలు ఉరివేసుకుని మరి నిరసన తెలిపారు.

New Update
Anganwadi Workers : కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన..ఉరివేసుకుని మరి..!

Anganwadi Workers Protest : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అధికారంలోకి రాకముందుకు నేను విన్నాను- నేను ఉన్నాను మీ కుటుంబంలో వెలుగులు నింపుతామని ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని.. హామీలిచ్చి నాలుగున్నర సంవత్సరాలు పూర్తయిన వాటిని నెరవేర్చలేదంటూ అంగన్వాడీలు అందోళన చేస్తున్నారు. పది రోజుల సమ్మెలో అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేశారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా వెలుగులు నింపుతామన్న జగన్మోహన్ రెడ్డి మా కుటుంబాలను చీకట్లోకి పడవేస్తున్నాడని, మాకు చావే గతి అంటూ అంగన్వాడీలు ఉరివేసుకుని నిరసన తెలిపారు.

Also read: జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చంద్రబాబు, పవన్.!

నంద్యాల(Nandyal) పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా మూకుమ్మడిగా 300 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉరివేసుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు కార్యదర్శి సునీత అధ్యక్షత వహించగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారని, చాలా సంతోషంగా హంగు ఆర్భాటాలు చేపడుతున్నారని, కానీ మా కుటుంబాల్లో చీకట్లో అలముతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా వెంటనే స్పందించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని, గ్రాట్యూటి ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీఎంగా చివరి బర్త్ డే జరుపుకోవాల్సి వస్తుందని.. వైసీపీకి పుట్టగతులు లేకుండా ప్రజలను లబ్ధిదారులను, గర్భవతులను, బాలింతలను ఐక్యం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం నిర్మల, ప్రాజెక్టు కార్యదర్శి సునీత లతోపాటు దాదాపు 300 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా ఆలమేవా అధ్యక్షుడు అబులైజ్, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గంగాధర్ శెట్టి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు పాల్గొని మద్దతుగా తెలిపారు.

YS

Advertisment
తాజా కథనాలు