Anganwadi workers: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంగన్వాడీలు ఆందోళన (Anganwadi workers) చేపట్టారు. ఐ.సి.డి.ఎస్.కార్యాలయం వద్ధ తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు. ఎన్నికల ముందు సీఎం జగన్(CM Jagan) ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని రోడ్డెక్కారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని.. ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పనిభారం పెంచారు.. జీతాలు మాత్రం పెంచట్లేదని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నాసిరకం ఫోన్లు ఇచ్చి యాప్‌లలో విధులకు సంబంధించిన వివరాలు అప్‌డేట్ చేయమంటే ఎలా చేయాలి? అని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక తమ గోడు పట్టించుకోవడం లేదంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు అంగన్వాడి కార్యకర్తలు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: రాజీనామాలపై అలర్ట్ అయిన వైసీపీ..దేవన్ రెడ్డి వెనక్కి తగ్గినట్టేనా?
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వంతో రెండు రోజులుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. అంగన్‌వాడీలకు మద్దతుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూలు కలిసి ఉమ్మడిగా సమ్మెలో పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సీడీపీవో కార్యాలయాలు, మండల కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నిరాహారదీక్షలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Also Read: రాజధానిని విశాఖకు తరలించడం లేదు.. హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్