AP: 'సమస్యలు పరిష్కరించాల్సిందే'.. సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించిన అంగన్వాడీలు.!

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె 7వ రోజుకు చేరింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంగన్వాడీలు ఎర్రచీరలు ధరించి పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

New Update
AP: 'సమస్యలు పరిష్కరించాల్సిందే'.. సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించిన అంగన్వాడీలు.!

Anganwadi Protest: తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7వ రోజు కు చేరింది. ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఏడో రోజు సమ్మెలో అంగన్వాడీలు ఎర్ర చీరలు ధరించి పెద్ద ఎత్తున పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. అంగన్వాడీలను చూసిన సబ్ కలెక్టర్ సేతు మాధవన్ వెంటనే కార్యాలయం నుండి బయటికి వెళ్లిపోయారు. ఈ సమ్మెలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, సిఐటియు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని 13 మండలాలకు చెందిన అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. అవసరమైతే సమస్యల సాధన కోసం త్వరలో రాజధానిని కూడ ముట్టడిస్తామని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ తెలిపారు.

Also Read: ఎన్నికల తర్వాత నేడు తొలిసారి కాంగ్రెస్ పీఏసీ భేటీ.. వారికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు?

అంగన్ వాడీ కార్యకర్తలు తలుచుకుంటే ఏమవుతుందో గత ప్రభుత్వాలను అడగాలని సీఎంను అంగన్ వాడీలు హెచ్చరించారు. సీఐటీయూ కార్యాలయం నుంచి ఒంగోలు కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. కేసీఆర్ ఫాం హౌస్ కి ఎలా పరిమితమయ్యారో.. సీఎం జగన్ కూడా ఇడుపులపాయ ఫాం హౌస్ కి పరిమితమవ్వాల్సి ఉంటుందన్నారు. ఆందోళనలు ఆపకపోతే.., రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న లక్ష మంది అంగన్ వాడీ వర్కర్లను తొలగిస్తామని మంత్రులు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు