ATP: అమ్మవారు వేషయంలో అంగన్వాడీ కార్యకర్త వినూత్న నిరసన.!

పుట్టపర్తిలో అంగన్వాడీ కార్యకర్త వినూత్నంగా నిరసన తెలిపింది. వేప మండలు చేత పట్టుకుని అమ్మవారు పూనినట్లు చేసింది. మా కోరికలు నెరవేర్చాలని సీఎం జగన్ కు చెప్పు తల్లీ అంటూ మొక్కులు మొక్కుకుంటూ నిరసన తెలిపింది అంగన్వాడీ కార్యకర్తలు.

New Update
ATP: అమ్మవారు వేషయంలో అంగన్వాడీ కార్యకర్త  వినూత్న నిరసన.!

Anganwadi protest: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్ డి ఓ కార్యాలయం ఎదుట అంగన్ వాడీ కార్యకర్తల సమ్మె ఐదవ రోజు వినూత్నంగా నిర్వహించారు. అమ్మవారు పూనినట్లు ఓ అంగన్వాడీ కార్యకర్త పుట్టపర్తి ఆర్డిఓ కార్యాలయం వద్ద వేప మండలు చేతబట్టుకొని.. భక్తులారా ఏమి మీ కోరిక అంటూ పూనకం వచ్చినట్టు ఊగిపోతూ వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేశారు.

Also Read: ‘మమ్మల్ని మీరు పీకేస్తే.. మేం మిమ్మల్ని పీకేస్తాం’.. అంగన్వాడీల హెచ్చరిక.!

తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేపడుతున్న ఆందోళనలు 7వరోజు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లా కేంద్రం పుట్టపర్తి ఆర్డిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్త వేప మండలు చేత పట్టుకుని భక్తులారా ఏమి కోరిక అంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. మిగిలిన అంగన్వాడీ కార్యకర్తలు.. 'ఐదు రోజులుగా నిద్ర ఆహారాలు మానుకొని రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు తల్లి.. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని.. పని భారాన్ని తగ్గించి మా సమస్యలు పరిష్కరించి.. కనీస గౌరవ వేతనం ఇచ్చేలా సీఎం జగన్ కు చెప్పు తల్లి'.. అలా చేస్తే ఆయనకు మరో అవకాశం ఇస్తామని వేడుకున్నట్లు నిరసన తెలియజేశారు.

Also Read: నేడు బిగ్ బాస్ ఫైనల్స్.. విన్నర్ ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

అనంతరం అంగన్వాడి వర్కర్లు మాట్లాడుతూ గత ఐదు రోజులుగా నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కనీస గౌరవ వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు