Anganwadi Workers Vs AP Government : అంగన్వాడీ(Anganwadi) లతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీలు విధుల్లోకి చేరనున్నారు. అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana). జులైలో జీతాలు పెంచుతామని స్పష్టం చేశారు. ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50 వేల నుంచి లక్షా 20 వేల రూపాయలకు పెంచామన్నారు. ఇక హెల్పర్ కు 60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
మట్టి ఖర్చులు 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని.. సమ్మె కాలానికి జీతాలు ఇస్తామని తెలిపారు.
AP Anganwadi News : అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు సఫలం.. జీతాల పెంపు ఎప్పుడంటే?
ఏపీ ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాలు జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జులైలో జీతాలు పెంచుతామని హామీ ఇవ్వడంతో అంగన్వాడీలు తిరిగి తమ విధుల్లో చేరనున్నారు.
Translate this News: