Android Phone: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? ఇలా చేయకపోతే హ్యాకర్లకి  దొరికిపోతారు 

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడినపుడు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే దానిలో ఉన్న యాప్స్ సహాయంతో హ్యాకర్లు మీ సమాచారాన్ని దొంగిలిస్తారు. 

Android Phone: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? ఇలా చేయకపోతే హ్యాకర్లకి  దొరికిపోతారు 
New Update

ఆండ్రాయిడ్ ఫోన్(Android Phone) కంప్యూటర్ కంటే ఏమాత్రం తక్కువ కాదు, ఇందులో మన అనేక గందరగోళాలు - ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. తనను వాడే వారి గురించి అన్ని విషయాలు దానికి పూర్తిగా తెలుసు. దాని దగ్గర మన  బ్యాంక్ ఎకౌంట్ సమాచారం, అన్ని రకాల పాస్‌వర్డ్‌లు, ఫోటోగ్రాఫ్‌లు ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం, ఇవన్నీ దానికి బాగా తెలుసు. అందుకే మొబైల్‌ను వైరస్‌ల బారిన పడకుండా భద్రంగా ఉంచుకోవాలని ఎప్పుడూ చెబుతుంటారు. అయితే ఇది మాత్రమే చాలదు. మీరు మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే, మీరు మార్చవలసిన కొన్ని Android ఫోన్ సెట్టింగ్‌లు ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ మన మొబైల్ బ్యాటరీని కూడా కాపాడుతాయి. 

మైక్రోఫోన్ ప్రతిదీ వింటుంది

మీరు మీ స్నేహితుడితో ఏదో ఒక విషయం లేదా అంశం గురించి మాట్లాడారు. దాని తరువాత రెండు గంటలు గడిచాయి. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఎదో చూస్తున్నారు. అప్పడు మీరు మీ స్నేహితుడితో మాట్లాడిన విషయానికి సంబంధించిన  ప్రకటనలు లేదా పోస్ట్‌లు కనిపించడం మీరు గమనించి ఉండవచ్చు. అటువంటప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి మనం మొబైల్‌లో వాయిస్ అసిస్టెంట్‌ని యాక్టివ్‌గా ఉంచినప్పుడు, ఇతర యాప్‌లు మైక్రోఫోన్‌కు యాక్సెస్‌ను(Android Phone) పొందుతాయి.  ఆ తర్వాత అవి మన సంభాషణలన్నింటినీ వింటాయి.  ఈ సమాచారాన్ని ముందుకు పంపుతాయి.  దీంతో మనం ఆ విషయాలకు సంబంధించిన ఆ ప్రకటనలన్నింటినీ చూడటం ప్రారంభిస్తాము. మన ఫోన్‌లోని మైక్రోఫోన్ మన సంభాషణలను ఎప్పటికప్పుడు వింటోంది. దీన్ని ఆఫ్ చేయడానికి, సెట్టింగ్‌లకు వెళ్లి, సెక్యూరిటీ -  ప్రయివసీ సెక్షన్ కు  వెళ్లి, ఆపై ప్రయివసీ క్లిక్ చేసి, ఫోన్ - కెమెరాకు యాక్సెస్ ఉన్న యాప్‌లను ఆఫ్ చేయండి.

Also Read:  పాతికేళ్లకే క్రెడిట్ కార్డు.. క్రెడిట్ కార్డుల వాడకం మామూలుగా లేదు.. 

నోటిఫికేషన్‌లను పరిమితం చేయండి

కొన్నిసార్లు మనం మన ఫోన్‌ని(Android Phone) కాలేజీలో, ఆఫీసులో లేదా ఇతర ప్రదేశాలలో ఎక్కడన్నా మర్చిపోతాం. ఫోన్ పాస్‌వర్డ్‌తో ఉండవచ్చు, కానీ నోటిఫికేషన్‌లు సమస్యలను సృష్టించవచ్చు. నోటిఫికేషన్‌లు ఇతరులకు కనిపించవచ్చు లేదా మొబైల్ పోయినట్లయితే లేదా ఎవరైనా  తప్పుడు వ్యక్తి చేతిలో పడితే, మీరు మోసానికి గురవుతారు. మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి నోటిఫికేషన్‌ల ఎంపికను ఎంచుకోండి. ఇందులో, మెసెంజర్, బ్యాంక్, UPI యాప్, సోషల్ మీడియా, మొదలైన వాటి నోటిఫికేషన్‌లను నిలిపివేయండి. కొన్ని మొబైల్‌లలో, వీటికి బదులుగా సెన్సిటివ్ నోటిఫికేషన్ ఎంపిక ఉంటుంది, దానిని ఆఫ్ చేయాలి.

మీరెక్కడ ఉన్నారో కచ్చితంగా మీ ఫోన్ కి తెలుసు 

మీ ఫోన్‌లో(Android Phone) చాలా యాప్‌లు ఉంటాయి, అవి అవసరం లేకపోయినా మీ లొకేషన్‌కు యాక్సెస్‌ను కలిగి ఉంటాయి. దీంతో మీరు ఎక్కడికి వెళ్లినా ఆ యాప్‌ల రికార్డుల్లో ఆ లొకేషన్‌ నమోదవుతుంది. మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి ప్రయివసీ ఎంపికను ఎంచుకోండి. దీని తర్వాత, పర్మిషన్ మేనేజర్‌లో చెక్ చేయండి. అనవసరమైన అనుమతులు ఇచ్చిన అన్ని యాప్‌లు ఇక్కడ ఉంటాయి.  భద్రతతో పాటు, మీ లొకేషన్‌ను ఆఫ్ చేయడం ద్వారా, మీరు డేటా - బ్యాటరీని కూడా ఆదా చేయగలుగుతారు.

Wi-Fi - బ్లూటూత్

Android Phone: మనం ఏదైనా పబ్లిక్ ప్లేస్‌కి వెళ్లినప్పుడు, మొబైల్ అక్కడ ఉన్న వై-ఫై, రూటర్, పబ్లిక్ హాట్‌స్పాట్, బ్లూటూత్ మొదలైనవాటిని స్కాన్ చేయడం ప్రారంభిస్తుంది. ఉచిత Wi-Fi అందుబాటులో ఉంటే,  మనం  దానిని ఉపయోగిస్తాము. కానీ హ్యాకర్లు Wi-Fi - బ్లూటూత్ సహాయంతో మీ ఫోన్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఈ రెండింటినీ ఆఫ్ చేయడానికి, మొబైల్ సెట్టింగ్‌లకు వెళ్లండి. అక్కడ ఈ రెండిటినీ అవసరం లేని సమయంలో ఆఫ్ లో పెట్టుకోండి. 

#smart-phone #android-phone
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe