Chandrababu Naidu: ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే ..వారికి అదే చివరి రోజు: చంద్రబాబు!

ఆడ బిడ్డల జోలికి వస్తే..అదే వారికి చివరి రోజు అనే విషయం నేరస్తులకు అర్ధం కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం తప్పు చేసేవారిలో కనిపించేలా పోలీసు శాఖ పని చేయాలన్నారు.

New Update
Press Meet : గెలుపు తరువాత చంద్రబాబు సంచలన ప్రెస్ మీట్

Chandrababu Naidu: మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలని, ఆడ బిడ్డల జోలికి వస్తే ..అదే వారికి చివరి రోజు అనే విషయం నేరస్తులకు అర్ధం కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలని, నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం తప్పు చేసేవారిలో కనిపించేలా పోలీసు శాఖ పని చేయాలని అన్నారు. నేరం జరిగిన తర్వాత నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం ఒక ఎత్తు అయితే ..అసలు నేరం చేయాలంటేనే భయపడే స్థితి కల్పించాలన్నారు.

వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బుధవారం హోంశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి వంగల పూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలకు భద్రత విషయంలో గట్టి భరోసా ఇచ్చేలా పోలీసు శాఖ పనితీరు ఉండాలని, పూర్తి స్థాయి శాంతి భద్రతలతో ప్రశాంతమైన రాష్ట్రంగా ఏపీ అభివృద్ది చెందాలని బాబు అన్నారు.

రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు అన్నారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్తులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పని చేయాలని చంద్రబాబు అన్నారు.

Also Read: జేఎంఎంలో అవమానాలు..అందుకే కొత్త పార్టీ: చంపయీ సోరెన్‌!

Advertisment
తాజా కథనాలు