జరిగింది ఇదే.. ఆస్తులపై షర్మిల సంచలన ట్వీట్!

AP: తన అన్న జగన్‌తో ఉన్న ఆస్తుల వివాదంపై షర్మిల సంచలన ట్వీట్ చేశారు. ఆస్తుల్లో తన నలుగురు మనవాళ్లకు సమాన వాటా ఉండాలని వైఎస్ఆర్ అన్నారని. ఆస్తులకు జగన్ గార్డియన్ మాత్రమే అని.. తనకు ఆస్తుల్లో సమాన వాటా ఉందని చెప్పారు.

author-image
By V.J Reddy
Sharmila Jagan
New Update

YS Sharmila: తన అన్న జగన్‌తో ఉన్న ఆస్తుల వివాదంపై షర్మిల సంచలన ట్వీట్ చేశారు. ఆస్తుల్లో తన నలుగురు మనవాళ్లకు సమాన వాటా ఉండాలని వైఎస్ఆర్ అన్నారని. ఆస్తులకు జగన్ గార్డియన్ మాత్రమే అని.. తనకు ఆస్తుల్లో సమన వాటా ఉందని చెప్పారు. తనకు రూ.200 కోట్లు జగన్ ఇచ్చారనే వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. తనకు రావాల్సిన వాటాలో నుంచే జగన్ ఇచ్చారని.. తన సొంత జేబులో నుంచి ఇవ్వలేదని స్పష్టం చేసింది. కాగా వైఎస్సార్ ఆస్తులపై గత రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆస్తుల వివాదంపై మాట్లాడిన జగన్.. ప్రతీ కుటుంబంలో జరిగేదే అని.. దీనిని రాజకీయ చేయడం సరికాదని అన్నారు. జగన్ వ్యాఖ్యలు కౌంటర్ గా షర్మిల.. ప్రతీ కుటుంబాల్లో ఆస్తుల వివాదం ఉంటుందని కానీ.. తల్లిని, చెల్లిని కోర్టుకు లాగడం కరెక్ట్ కాదని అన్నారు. తాజాగా ఆస్తుల వివాదంపై షర్మిల ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: ఇవి ఉంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. మంత్రి సంచలన ప్రకటన!

అన్ని కుటుంబ ఆస్తులే...

షర్మిల లేఖలో.. "నాన్న బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో, సరస్వతి అయినా... భారతి సిమెంట్స్ అయినా... సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ. యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా... నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి. అన్నది వైఎస్ఆర్ మాండేట్. (ఒక్క సండూరు మినహాయించి) రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదు. వైఎస్ఆర్ హఠాత్తుగా మరణించారు. ఆ తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదు. ఈ రోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో లేదు. స్వార్జితం అని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్న ఆస్తులు అన్ని కుటుంబ ఆస్తులే. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవం. ఈరోజు సాక్షిలో చూపినట్లుగా మా తాతల ఆస్తి చిన్నప్పుడే నా పేరు మీద పెట్టినంత మాత్రాన. అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు.. ఇతరులతో ఒక వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్లు కాదు. 

ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!

ఆస్తి పంచడం అంటే ఇవిగో ఈ ఆస్తులు నీకు. ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పి ఉంటే అది ఆస్తి పంచేయడమంటే. నేను జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల్లో వాట అడుగుతున్నాను అనేది హాస్యాస్పదం. ఇవన్నీ కుటుంబ ఆస్తులు కనుక రాజశేఖర్ రెడ్డి గారు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచాలి అనుకున్నారు. కాబట్టే.. ఈ రోజు వరకు వీటి గురించి మాట్లాడుతున్నాం నాకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై మోజు లేదు. వీళ్ళు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదు. కేవలం నా బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలి అనేది రాజశేఖర్ రెడ్డి గారి అభిమతం గనుక, ఈ రోజు వరకు కూడా అమ్మైనా. నేనైనా తపన పడుతున్నాం." అని పేర్కొంది

ఇది కూడా చదవండి: రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!

200 కోట్లపై క్లారిటీ..

"ఇప్పటికీ అమ్మ వెయ్యి సార్లు వీళ్ళను అడిగి ఉంటుంది. వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుంది. అయినా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత.. 10 ఏళు జగన్ గారు ఇబ్బందులు పడితే, అవి నా ఇబ్బందులు అనుకొని..నా శక్తికి మించిన సహాయం చేశాను. తోడబుట్టిన వాడికోసం నా బిడ్డలను సైతం పక్కనపెట్టి ఆయన్ను, ఆయన పార్టీని ఏ స్వార్థం లేకుండా నా భుజాల మీద మోశాను. ఆ 10 ఏళ్ళు నా అవసరం ఉంది అనుకున్నారో. ఏమో... నన్ను బాగానే చూశారు. పెద్ద కూతురు అన్నారు. ఆ 10 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి గారు ఊహించినట్లుగానే.. గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు సమానం అన్నట్లుగానే వ్యవహరించారు. ఆ 10 ఏళ్లలో 200 కోట్లు ఇచ్చామని చెప్తున్నది ఇందులో భాగంగానే. ఆ 10 ఏళ్లు నా బిడ్డలకు సమాన వాటా ఉందని గుర్తిస్తూ.. కంపెనీల్లోని డివిడెండ్ లో సగం వాటా నాకు ఇవ్వడమే ఈ 200 కోట్లు, వాళ్ళు చేసింది ఉపకారం కాదు. ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదు. నాకు సమాన వాటా ఉంది కాబట్టి డివిడెండ్ లో సగం వాటా ఇవ్వడం జరిగింది. అది కూడా అప్పుగా చూపించమన్నారు." అని లేఖలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: భారత్‌కు ఉగ్రవాది హెచ్చరిక.. రేపటి నుంచి!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe