జగన్, షర్మిలకు ఉన్నది ఆస్తి తగాదాలు కాదని ఆమె భర్త అనిల్ అన్నారు. అలా అయితే షర్మిల ఏపీలోనే పార్టీ పెట్టేదన్నారు. తమకు ఆస్తులు ఇవ్వలేదని.. ఇది అందరికీ తెలిసిన సత్యమేనన్నారు. 2019 ఎన్నికల వరకు ఒకలా.. ఆ తర్వాత మరోలా జగన్ ప్రవర్తించడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఓ యూట్యాబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్, షర్మిలకు మధ్య ఉన్న విభేదాలపై అనేక కీలక అంశాలను వెల్లడించారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు జగన్ ఆపాలని ప్రయత్నించారని ఆరోపించారు. పార్టీలోకి వచ్చేవారిని రాకుండా, సహాయం చేయకుండా చేశారన్నారు. అయినా షర్మిలా ఒక్క మాట కూడా అనలేదన్నారు. షర్మిల తెలంగాణలో కేసీఆర్ పై పోరాడిందని.. అతను ఓడిపోయాడన్నారు.
Also Read : దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి?
Also Read : 10 నిమిషాల రన్నింగ్‌తో ఆ ప్రమాదకరమైన వ్యాధులు దూరం
పార్టీ పెట్టమని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు..
2019 ఏపీ ఎన్నికల తర్వాత ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టాలని షర్మిలను అడిగినట్లు చెప్పారు. అప్పుడు వెళ్లి మా అన్ననే అడుగు అని షర్మిల అతనికి చెప్పిందన్నారు. అతను వెళ్లి జగన్ ను అడిగితే అక్కడ కేసీఆర్ ఉన్నాడని.. తమ ఆస్తులన్నీ అక్కడే ఉన్న కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయని వద్దని చెప్పినట్లు అనిల్ తెలిపారు. పదవి, ఆస్తి కావాలని షర్మిల జగన్ ను అడగలేదని బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పారు. ఆస్తి షర్మిల హక్కు అని.. న్యాయం ఇప్పుడు కాకపోయినా మరెప్పుడైనా గెలుస్తుందన్నారు. అన్న అంటే షర్మిలకు పిచ్చి అని.. అన్న కోసమే పాదయాత్ర చేసిందన్నారు. భారతి అడిగితేనే పాదయాత్ర చేసిందన్నారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి జైలులో ఉన్న జగన్ వద్దకు వెళ్లి షర్మిల పార్టీని ఎత్తుకుపోతుందని చెప్పాడన్నారు. అప్పటి నుంచే వారిలో అభద్రతాభావం మొదలైందన్నారు.
Also Read : KTR, హరీష్ మధ్య కొట్లాట.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
ఆస్తి ఇవ్వకుండా అప్పు అని రాసుకున్నారు..
ఈడీ కేసుల కారణంగా ఆస్తులు ఇవ్వకపోతే.. మరి జగన్ వాడుకుంటున్నాడు కదా? అని ప్రశ్నించారు. షర్మిలకు కూడా వాడుకోవడానికి ఇవ్వొచ్చు కదా? అన్నారు. ఇవ్వాలి అనుకుంటే వంద రకాలుగా ఇవ్వొచ్చన్నారు. తండ్రి దగ్గర నుంచి ఆమెకు, ఆమె నుంచి పిల్లలకు ఆస్తి రావాలన్నారు. మా పిల్లలు ఇబ్బంది పడితే వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా? అని ప్రశ్నించారు. జగన్ దగ్గర షర్మిల అప్పు తీసుకోలేదని.. వారే రాసుకున్నారన్నారు. ఆస్తి ఇవ్వకుండా అప్పుగా చూపించారని ఆరోపించారు. వైఎస్ ఉన్నప్పుడు ఆస్తుల పంపకాలు జరగలేదన్నారు.
Also Read : చంపేస్తామంటూ.. బాబా సిద్దిఖీ కుమారుడికి బెదిరింపులు
విజయమ్మ కూడా బాధితురాలే..
విజయమ్మకు అంతా తెలుసని.. ఆమె బాధితురాలని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండలేకనే ఆమె ఫారిన్ వెళ్లిపోయారన్నారు. వివాదాల పరిష్కారానికి విజయమ్మ ప్రయత్నించినా జగన్ వినలేదన్నారు. మొండిగా, మూర్ఖంగా ఉంటే ఏం చేయలేమన్నారు. జగన్ కు వచ్చిన సీట్లు 151 అని అది తన నంబర్.. దేవుడు ఇచ్చిన నంబర్ అని అన్నారు. తన కారు నంబర్, మొబైల్ నంబర్ కూడా అదేనన్నారు. ఎన్నికల సమయంలో పాస్టర్లకు తాను ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. బీజేపీ కన్ను తనపై ఉందని జగన్ అన్నడన్నారు. అందుకే తనను కూడా ఉపన్యాసాలు ఇవ్వొద్దని అన్నాడన్నారు.