/rtv/media/media_files/2024/12/12/yJUhYrZ1dCTZ8UpFA8vJ.webp)
ఏపీ మాజీ సీఎం జగన్‌కు బిగ్‌షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆయనకు గతంలో మంజూరు చేసిన మినహాయింపును రద్దు చేస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ జగన్‌ను ఆదేశించిన న్యాయస్థానం, ఈ నెల 21వ తేదీ (గురువారం) లోపు హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది.
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు
గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు, ప్రభుత్వ బాధ్యతల కారణంగా ప్రతి వారం విచారణకు హాజరుకాలేనని జగన్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అప్పట్లో కోర్టు ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును మంజూరు చేసింది. జగన్ మోహన్ రెడ్డి చివరిసారిగా 2020 జనవరి 10వ తేదీన సీబీఐ కోర్టు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన ఈ మినహాయింపును పొందుతున్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో, రేపు (నవంబర్ 21) ఉదయం జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది.
Follow Us