మా అమ్మను నేను చంపుతానా?: విజయమ్మ కారు ప్రమాదంపై స్పందించిన జగన్ ఏపీలో చీకటి రోజులు నడుస్తున్నాయని మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. తన తల్లి కారుకు తాను ప్రమాదం చేయించినట్లుగా టీడీపీ సోషల్ మీడియాలో పెట్టారని ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కు సినిమా డైలాగులు కొట్టడం తప్పా.. సీఎంను ప్రశ్నించడం తెలియదని ఎద్దేవా చేశారు. By Nikhil 07 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఎప్పుడో తన తల్లి కారుకు ప్రమాదం జరిగితే ఇప్పుడు జరిగినట్లు టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో పెట్టారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ధ్వజమెత్తారు. అంతే కాకుండా తాను తల్లిని చంపేందుకు కుట్ర చేసినట్లు చిత్రీకరించారని ఫైర్ అయ్యారు. ఎప్పుడూ ఇదే ప్రభుత్వం ఉండదని.. జమిలీతో ఎన్నికలు ముందే జరిగితే తాము ముందుగానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాము వచ్చిన తర్వాత తమను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. రిటైర్ అయినా.. డిప్యుటేషన్ పై వచ్చిన వారు మళ్లీ వెళ్లిపోయినా విడిచేది లేదన్నారు. ఇది కూడా చదవండి: Chandrababu-Pawan: చంద్రబాబు, పవన్, అనిత కీలక భేటీ.. అసలేం జరుగుతోంది? మా అమ్మను చంపడానికి జగన్ ప్రయత్నించాడని టీడీపీ అధికారిక వెబ్సైట్లో ఫేక్ పోస్టు పెట్టారుఅది అబద్ధమని విజయమ్మ లేఖ విడుదల చేశారు. మరి చంద్రబాబును, నారా లోకేష్ నీ ఎందుకు అరెస్టు చేయలేదు??? - వైఎస్ జగనన్న! pic.twitter.com/dTrRf1OArt — Drakshayani Pantapalli (@DrakshayaniPC) November 7, 2024 సినిమా డైలాగులు కాదు.. సీఎంను ప్రశ్నించు.. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని సీఎంను ప్రశ్నించాలి కానీ.. దళిత మంత్రిని కాదన్నారు. చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం పవన్ కళ్యాణ్‌కు లేదన్నారు. సొంత నియోజకవర్గంలోనే ఓ టీడీపీ నాయకుడు.. దళిత మహిళపై అత్యాచారం చేస్తే డిప్యూటీ సీఎంగా నువ్వేం చేశావ్? అని ప్రశ్నించారు. ఇది చేయకుండా తోలు తీస్తానంటూ సినిమా డైలాగ్స్ కొడతాడని ఎద్దేవా చేశారు.ఇది కూడా చదవండి: AP: విడదల రజనిపై అసభ్యకర పోస్టులు.. లోకేష్, పవన్ పై అంబటి ఆరోపణలు! రిటైర్మెంట్ అయినా సప్త సముద్రాల అవతల ఉన్న ఏ ఒక్కడినీ వదిలిపెట్టను .. పోలీసులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. @ysjagan @ncbn @APPOLICE100 #TDP #YSRCP #RTV pic.twitter.com/5WfvKUjKjV — RTV (@RTVnewsnetwork) November 7, 2024 ఏపీలో చీకటి రోజులు.. ఏపీలో చీకటి రోజులు నడుస్తున్నాయన్నారు. అన్ని వర్గాలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని జవన్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. హామీలపై ప్రశ్నిస్తున్న వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ లయ్యారు. #ys-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి