రాక్షస రాజ్యంలో దేవుడి దగ్గరికి కూడా.. : జగన్ ఎమోషనల్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని జగన్ మండిపడ్డారు. దేవుడి దర్శనానికి వెళ్లేందుకు కూడా అడ్డుకునే పరిస్థితులను తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు. By Nikhil 27 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని జగన్ మండిపడ్డారు. దేవుడి దర్శనానికి వెళ్లేందుకు కూడా అడ్డుకునే పరిస్థితులను తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు. గుడికి వెళ్లకూడదంటూ తమ పార్టీ నేతలకు నోటీసులు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాక్షస రాజ్యం కాదా? అని ప్రశ్నించారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ నేతలను తిరుపతికి రప్పిస్తున్నారని ఫైర్ అయ్యారు. టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారని కూటమి సర్కార్ ను ప్రశ్నించారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పిన విషయాలన్నీ అబద్ధాలన్నీ ఒక్కొక్కటిగా రుజువు అవుతున్నాయన్నారు. వంద రోజుల పాలనను డైవర్ట్ చేయడానికి లడ్డూ విషయం తీసుకువచ్చారన్నారు. లడ్డూ టాపిక్ ను డైవర్ట్ ను చేసేందుకు ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ టాపిక్ ను తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు కేవలం రాజకీయంగా లబ్ధి పొందడం కోసం తిరుపతి లడ్డూ విశిష్టతను దెబ్బ తీసేలా కుట్ర చేస్తున్నాడన్నారు. ఈ వార్త అప్డేట్ అవుతోంది.. #Tirupati Laddu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి