AP News: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పరస్పరం టీడీపీ, వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. ఇంటి ముందు ఉన్న ఇసుక కుప్ప విషయంలో వివాదం తలెత్తింది. కత్తులు, కర్రలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ:
ఇది కూడా చదవండి: ఇంట్లో ఎలుకల బెడద ఉందా?.. ఇలా చేస్తే పారిపోతాయి
ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పికెటింగ్ ఏర్పాటు చేశారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో టీడీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి. అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడి చేయటంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: పిల్లలకి ఏ వయసులో ఏ టీకా వేయించాలి?
ఇది కూడా చదవండి: బంధువులు మరణిస్తే దీపావళి జరుపుకోవచ్చా?
ఇది కూడా చదవండి: నడుంనొప్పి కంటిన్యూగా వస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు