Rat: ఇంట్లో ఎలుకల బెడద ఉందా?.. ఇలా చేస్తే పారిపోతాయి ఇంట్లోంచి ఎలుకలను తరిమికొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. లవంగాలు, యాలకుల, పుదీనా నూనెను పిచికారీ, మిరపకాయ, వెల్లుల్లి, అమ్మోనియా వాసన చూసినా ఎలుకలు పారిపోతాయి. By Vijaya Nimma 21 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/5 ఇంట్లో ఎలుకలు ఉండటం ఒక సాధారణ సమస్య. దీని కారణంగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఇంట్లోంచి ఎలుకలను తరిమికొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఎలుకల బారి నుంచి బయటపడవచ్చు. 2/5 ఇంట్లో నుంచి ఎలుకలను తరిమికొట్టడానికి ఉల్లిపాయలను కత్తిరించి ఎలుకలు ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో ఉంచండి. ఎందుకంటే ఎలుకలు ఉల్లిపాయల వాసనను ఇష్టపడవు. 3/5 లవంగాలు, యాలకుల ఘాటు వాసన ఎలుకలను నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఎలుకలు ఎక్కువగా ఉన్న చోట యాలకులు, లవంగాలను ఉంచాలి. 4/5 ఎలుకలు ఇంట్లోకి వచ్చే అన్ని ప్రదేశాల దగ్గర పుదీనా నూనెను పిచికారీ చేయండి. ఎందుకంటే ఎలుకలు పుదీనా వాసనను ఇష్టపడవు. అంతేకాకుండా ఎలుకలు ఎక్కువగా వచ్చే చోట్ల మిరపకాయ, వెల్లుల్లి ద్రావణాన్ని కూడా స్ప్రే చేయవచ్చు. ఈ ఘాటైన వాసన వల్ల ఎలుక ఇంట్లోకి రావు. 5/5 అమ్మోనియా వాసన చూసినా ఎలుకలు పారిపోతాయి. అమ్మోనియాను ఒక గిన్నెలో వేసి ఎలుకలు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో ఉంచితే ఆ దరిదాపులకు కూడా రావని నిపుణులు అంటున్నారు. #home-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి