YS Jagan: మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనపై రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపింది. జగన్.. తిరుమలకు ఎలా వెళ్తావ్ ..? అని ఏపీ బీజేపీ ప్రశ్నించింది. టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు. డిక్లరేషన్ ఫామ్ నింపిన తర్వాత జగన్ తిరుమలలో అడుగుపెట్టాలని అన్నారు. ఈ క్రమంలో డిక్లరేషన్ ఫామ్ ను ట్వీట్ చేశారు. లడ్డూ వివాదం నేపథ్యంలో 28వ తేదీన తిరుమలకు వెళ్లనున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరుమల పవిత్రను ప్రభుత్వం దెబ్బతీసిందని చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలకు వైసీపీ పిలుపునిచ్చింది. 28న తిరుమలకు కాలి నడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు జగన్.
వైసీపీ శ్రేణులకు నిన్న పిలుపు...
తిరుపతి లడ్డూ కల్తీ అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న వేళ నిన్న వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని ఆసత్య ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు తిరుమల, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వైసీపీ Vs టీడీపీ...
ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ అంశం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. నాటి వైసీపీ పాలకుల కారణంగానే లడ్డూ కల్తీ జరిగిందని కూటమి సర్కార్ ఆరోపిస్తోంది. ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని సైతం నిర్వహింది. ఈ ఘటనపై విచారణకు సిట్ ను సైతం ఏర్పాటు చేసింది చంద్రబాబు సర్కార్. అయితే.. ఇదంతా చంద్రబాబు కుట్ర అని వైసీపీ ఆరోపిస్తోంది. రాజకీయాల కోసం జరగని దాన్ని జరిగినట్లుగా చంద్రబాబు అబద్ధలు చెబుతున్నాడంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలోనూ తిరుమల లడ్డూ అంశంపై యుద్ధమే జరుగుతోంది.
Also Read : పెన్షన్ కోసం 2 కి.మీ మోకాళ్లపై.. వృద్ధురాలు!