Filmymoji: కామెడీతో పొట్ట చెక్కలు చేసిన మధు, డూపేశ్.. క్లైమాక్స్‌లో మాత్రం ఏడుపొచ్చింది భయ్యా!
ఆవకాయ కోసం అవకాశం కోసం వెయిట్ చేయకూడదు బ్రో.. మనమే క్రియేట్ చేసుకోవాలి లేకపోతే బద్దే మిగులుద్ది బ్రో.. అంటూ ఫిల్మీమోజీ ఎప్పటిలాగే ప్రేక్షకులను యూట్యూబ్‌కు కట్టిపడేసింది. 'సమ్‌థింగ్ మిస్సమ్మ' ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేసిన ఫిల్మీమోజీ లవర్స్‌ని ఎపిసోడ్ ఫుల్ మిల్స్ ట్రీట్ ఇచ్చిపడేసింది. విజయనగరం నుంచి జమ్మలమడుగుకి వెళ్లి చిక్కుకుపోయిన మధు చివరకు తల్లిదండ్రుల వద్దకు చేరాడు. సిరీస్ స్టార్టింగ్ నుంచి పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన ఫిల్మీమోజీ చివరిలో మాత్రం పేరెంట్స్, ఫ్రెండ్స్ సెంటిమెంట్ పెట్టి ఏడిపించేసింది.